ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి*

📰 Generate e-Paper Clip

 

(పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక – అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి):జూలై 8: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా బుధవారం అనపర్తి కెనాల్ రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్ కటింగ్, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలే కారణమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పాటు పేదలకు గృహ స్థలాలు అందించడంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు.

ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి ప్రజల ఆదరణ పొందారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూపిన బాటలో నడుస్తూ పేద ప్రజలకు అండగా నిలవడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం తథ్యమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, టౌన్ అధ్యక్షుడు, రంగంపేట మండల ఇన్‌చార్జి నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణారెడ్డి, జడ్పీటీసీ సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ వారా కుమారి, ఎంపీటీసీలు కొండేటి భీమేష్, బండారు శ్రీను, ఏడుకొండలు, సత్తి వెంకట రామారెడ్డి, మాదాబత్తుల శంకర్‌బాబు, సత్తి శ్రీనివాసరెడ్డి , వెలగల లక్ష్మీనారాయణ రెడ్డి, సత్తి సూరారెడ్డి, షేక్ ఇబ్రహీం, సత్తి గంగిరెడ్డి, మాజీ వార్డు సభ్యులు సుమన్, యాసిడ్ రాము, జమ్మి, గుంటూరు శ్రీను, కోటి, వేమగిరి రవికుమార్, చింతా శ్రీను, కొవ్వూరి వెంకటరెడ్డి, పెనుగొండ శ్రీను, కానూరి కృష్ణ, సత్తి మణికంఠ రెడ్డి, పోతంశెట్టి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల వినయ్, తేతలి అజయ్ రెడ్డి, గుడిమెట్ల బాల మణికంఠ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest Articles

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంపగూడెం గ్రామస్తులు..నెల రోజులుగా తాగునీటి కష్టాలు.. గంటపాటు రాస్తారోకో

ఎస్సై చొరవతో అధికారుల హామీ.. ధర్నా విరమించిన గ్రామస్తులు పొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్...

తండ్రిని పట్టించుకోని కుమారులకు RDO షాక్ – ఆస్తి రిజిస్ట్రేషన్లు

⚖️ *కేసు వివరణ – ప్రొద్దుటూరు, కడప జిల్లా* పొలిటికల్ పవర్ సమగ్ర...

ప్రజాస్వామ్యానికి ప్రాణం ప్రశ్నించే తత్వమే: కుర్రే రాజేంద్ర రెడ్డి

 ​ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా, ప్రభుత్వాల విధానాలను నిశితంగా...

సీనియర్ సిటిజన్ల కోసం.

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

Related Articles

వినాయక చవితి వేడుకల్లో డీజేలకు నో!

 అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు బిక్కవోలు మండలంలో పోలీసుల అవగాహన సమావేశం బిక్కవోలు: వినాయక చవితి పండుగను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు బిక్కవోలు పోలీసులు ప్రత్యేక అవగాహన...

error: Content is protected !!