ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

*ఎంపీ వద్దిరాజు దసరా సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు*

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

దసరా (విజయదశమి) పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.హింధువుల ముఖ్యమైన పండుగల్లో ఇదొకటని,ఈ సందర్భంగా శక్తి స్వరూపిణి దుర్గామాతను కొలుస్తూ దేవీ నవ శరన్నవరాత్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటామని,భక్తులు మాలలు ధరించి నిష్ఠతో అమ్మ వారికి పూజలు చేస్తారన్నారు.శ్రీరామచంద్రుడు రాక్షసుల రాజు రావణుడిని అంతమొందించిన శుభదినాన్ని గుర్తు చేసుకుంటూ విజయదశమి పండుగను జరుపుకోవడం అనాది నుంచి ఆనవాయితీగా వస్తున్నదని ఎంపీ రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు.అలాగే, పాండవులు 12 ఏళ్ల వనవాసం,ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ముగించుకుని శమీ వృక్షం(జమ్మి చెట్టు) పై తాము దాచిపెట్టిన ఆయుధాలను తిరిగి చేతబట్టినది కూడా విజయదశమి నాడే అని మనకు పురాణాలు చెబుతున్నాయన్నారు.ఆయుధ పూజ చేసి జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు గావించి మనసులో ఉన్న కోరికను నెరవేర్చాలంటూ మొక్కడం,పాలపిట్టను దర్శించుకోవడం మన ఆచారమని ఎంపీ రవిచంద్ర వివరించారు.బతుకమ్మ,దసరా పర్వదినాలను పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పదేళ్ల తన పాలనలో పేద వర్గాల వారికి దుస్తులను బహుకరించేవారని ఆయన చెప్పారు.దసరాను తెలంగాణ ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సరదాగా, సంతోషంగా జరుపుకోవాల్సిందిగా ఎంపీ రవిచంద్ర కోరారు.విజయదశమి సందర్భంగా రాష్ట్ర వాసులతో పాటు దేశ విదేశాల్లో స్థిరపడిన, నివసిస్తున్న తెలంగాణ బిడ్డలందరికి ఎంపీ వద్దిరాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

*దుర్గామాత కరుణాకటాక్షాలతో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలి,చెడు నశించిపోవాలి: ఎంపీ వద్దిరాజు*

శక్తి స్వరూపిణి దుర్గామాత కరుణాకటాక్షాలతో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించి మహానేత కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వేడుకున్నారు.కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండూనూరేళ్లు జీవించాలని ఆయన ఆకాంక్షించారు.చెడు నశించిపోయి తెలంగాణ ప్రజలందరికి విజయాలు చేకూరాలని,వానలు విస్తారంగా కురిసి కరువు కాటకాలు పోయి రాష్ట్రం,ప్రజలు సుభిక్షంగా వర్థిల్లాలని ఎంపీ వద్దిరాజు దుర్గామాతను ప్రార్థించారు.

Latest Articles

అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!  పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట...

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ...

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ...

Related Articles

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిప్పని శేఖర్ అనే 28 సంవత్సరాల యువకుడు...

ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన సంబరాలు క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పాలాభిషేకం.. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ...
error: Content is protected !!