పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో నామ శేఖర్ ఖమ్మం: మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ, సెలవులు, భద్రతా ప్రమాణాలు, ఇతర చట్టబద్ధ సౌకర్యాలు అమలు చేయాలని మిషన్ భగీరథ కార్మిక సంఘాల ప్రతినిధులు ఎల్‌అండ్‌టీ యాజమాన్యాన్ని కోరారు. సబ్‌స్టేషన్ ఆపరేటర్లు, పంప్ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, క్లోరిన్ ఆపరేటర్లు తదితర కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్ వేతనాలు, బకాయిలు, చట్టబద్ధ ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తాగునీటి సరఫరా వ్యవస్థను నిరంతరం కొనసాగిస్తున్న కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ, యాజమాన్యం–కార్మిక సంఘాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని వారు కోరారు.
