ePaper
Friday, September 11, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కడపకాకినాడ లో నిరుద్యోగ యువత ఆందోళన పై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి.

కాకినాడ లో నిరుద్యోగ యువత ఆందోళన పై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి.

📰 Generate e-Paper Clip

ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి.

వయో పరిమితి పెంచాలి.

డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్.

పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ఎస్సై,కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని కోరుతూ కాకినాడ లో నిరుద్యోగ యువత శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగులు, DYFI, SFI నాయకుల పై అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని DYFI గా తీవ్రంగా ఖండిస్తున్నామని,తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కేసులు ఎత్తివేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని ప్రకటనలో డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలలో రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి నిరుద్యోగ యువత తో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారని అన్నారు.తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారు అని విమర్శించారు.ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన నిరుద్యోగుల పై భయబ్రాంతులకు గురి చేసే విధంగా కేసులు నమోదు చేశారని వారి ఉద్యమానికి మద్దతు ఇచ్చిన DYFI, SFI నాయకుల పై అక్రమంగా కేసులు నమోదు చేశారని అన్నారు.అసెంబ్లీ లో సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి అనిత గారు పోలీసు శాఖ లో పది వేల పోస్టులు భర్తీ అవసరమని చెప్పారని తీరా జాబ్ క్యాలెండర్ లో రెండు వేల పోస్టులు మాత్రమే పోలీసు శాఖలో ఖాళీలు చూపెడుతున్నారని ఇవి ఏ మాత్రం సరిపోవని అన్నారు.ప్రతి ఏటా చదువుకున్న నిరుద్యోగులు బయటకు వస్తున్నారని ప్రభుత్వాలు వదిలే పోస్టుల సంఖ్య మాత్రం పదులల్లో ఉన్నాయని అన్నారు.ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం ఒక్క డీఎస్సీ తప్ప ఇంకే పోస్టులు భర్తీ చేయలేదన్నారు.నిరుద్యోగులు కూడా వయో భారంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారని అది ప్రభుత్వాలు పోస్టులు భర్తీ చేయకపోవడం తోనే అన్నారు.కావున వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. కాకినాడ లో నిరుద్యోగుల పై, DYFI, SFI నాయకుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిరుద్యోగుల సమస్య తీవ్రతను గుర్తించి ఎస్సే, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలని,వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేసారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!