ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణకొమటి తండాలో ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన

కొమటి తండాలో ఘనంగా ఆంజనేయ స్వామి ఆలయ శంకుస్థాపన

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ జూలై 9 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు కొమటి తండాలో ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. తండా ప్రజల చిరకాల కోరిక అయిన ఈ ఆలయ శంకుస్థాపన మహోత్సవాన్ని గ్రామస్తులంతా కలిసి వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించి శంకుస్థాపన ప్రతిష్టించారు. శుభకార్యంలో తండా ప్రముఖులు అంగోతు శంకర్, కేష్య, శంకర్, నాగి, తిరుపతి, తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండాలో నిర్మించబోయే ఈ ఆలయం అందరి సహకారంతో త్వరగతిన పూర్తి కావాలని, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో తండా పెద్దలు, మహిళలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!