
పొలిటికల్ పవర్, దమ్మపేట, అక్టోబర్ 22:దమ్మపేట మండలంలో గురువారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం పాల్గొన్నారు. మండలంలోని మోండివర్రె గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధువును ఆశీర్వదించారు. అనంతరం దమ్మపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఆదివాసీ పోరాట యోధుడు గోండు బెబ్బులి కొమరం భీమ్ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. అలాగే అచ్యుతాపురం, అప్పారావుపేట గ్రామాల్లో జరిగిన దశదిన కర్మలకు హాజరై మృతుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు.
నూతన వధువుకు ఆశీర్వాదం
మొండివర్రె గ్రామానికి చెందిన చాట్ల శేఖర్–నాగమణి దంపతుల కుమార్తె సంధ్య వివాహ వేడుకకు సోయం వీరభద్రం హాజరయ్యారు. నూతన వధువును ఆశీర్వదించి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
కొమరం భీమ్‌కు ఘన నివాళులు
దమ్మపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం సమీపంలో నిర్వహించిన కొమరం భీమ్ జయంతి కార్యక్రమంలో సోయం వీరభద్రం పాల్గొన్నారు. కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన పోరాటాన్ని స్మరించుకుంటూ, “జల్.. జంగల్.. జమీన్” నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం కొమరం భీమ్ పోరాడారని గుర్తుచేశారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగించిన ఆయన పోరాటం ఆదివాసీ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
అనంతరం అచ్యుతాపురం గ్రామంలో తెల్లగోర్ల శ్రీను దశదిన కర్మకు హాజరైన సోయం వీరభద్రం, ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అప్పారావుపేట గ్రామంలో భోగి లక్ష్మీనారాయణ దశదిన కర్మకు హాజరై ఆయన చిత్రపటానికి పూలు సమర్పించారు.
ఈ కార్యక్రమాల్లో పాకనాటి శ్రీను, ఎలికే శ్రీను, కోటేశ్వరరావు, కుసిని వీరయ్య, పెద్ద నగేష్, కారం చలమరావు, ఎమరపు ముత్యాలరావు, ఎర్రంశెట్టి భాస్కరరావు, సోయం నరసింహరావు, చాట్ల వెంకటేశ్వరరావు, ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి, సోయం వెంకన్నబాబు, వాడే వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

