వాల్మీకి విగ్రహ కార్యక్రమంలో పాల్గొన్న మొగిలి సత్య రెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో ఆదికవి వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వాల్మీకి మహర్షికి భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మొగిలి సత్యారెడ్డి, మదిగట్ల గ్రామ సర్పంచ్ రాములు యాదవ్, గట్టు మన్యం, బాజ శ్రీనివాస్, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మొగిలి సత్యారెడ్డి మాట్లాడుతూ… ఆదికవి వాల్మీకి మహర్షి భారతీయ సాహిత్య చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్న మహనీయుడని పేర్కొన్నారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి సమాజానికి ధర్మం, సత్యం, నీతి, మానవతా విలువలను చాటిచెప్పారని తెలిపారు. వాల్మీకి మహర్షి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత విద్య, సంస్కారం, సామాజిక ఐక్యతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. వాల్మీకి మహర్షి విగ్రహ ఆవిష్కరణతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


