ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

గంజాయి అక్రమ దందాపై మరిపెడ పోలీసుల ఉక్కుపాదం…

📰 Generate e-Paper Clip

రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్…

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి: మరిపెడ గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై మరిపెడ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తొర్రూరు రోడ్డులోని మరిపెడ శివారు డబుల్ బెడ్‌రూం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా సుమారు రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, డిజిటల్ వెయింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు గంజాయిని చిన్నప్యాకెట్లుగా తయారుచేసి మరిపెడ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాల్లో విక్రయించేందుకు సిద్ధమైనట్లు విచారణలో వెల్లడైంది. ఈ..కేసులో పవార్ విజయ్, కంది అభిరామ్, బానోత్ మణిదీపక్‌ లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరిపెడ సీఐ ఎల్ పవన్ కుమార్ హెచ్చరించారు. గంజాయి సంబంధిత సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో మరిపెడ ఎస్‌ఐ గండ్రాతి సతీష్‌ తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Latest Articles

అలసత్వం వద్దు….పటాకులతో జాగ్రత్త -మేడిపల్లి పోలీసులు 

బాణసంచా దుకాణ యజమాలతో సమావేశం మేడిపల్లి: 04 నవంబర్ (పొలిటికల్ పవర్...

283 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలి.

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ...

*శ్రీ సాక్షిగణపతిస్వామికి విశేష అభిషేకం*

నంద్యాల జిల్లాశ్రీశైలం నవంబర్ 5(పొలిటికల్ పవర్ న్యూస్)లోక కల్యాణం కోసం...

Related Articles

చైర్మన్, వైస్ చైర్మన్ ఆదేశాలతో రంగంలోకి జూపల్లి ప్రమోద్.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత పర్యటన!* ప్రజల ఇబ్బందులపై ఆరా.. రోడ్లు, డ్రైనేజీల శుభ్రతకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన

:పొలిటికల్ పవర్ ప్రతినిధి  అశ్వారావుపేటఅశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు ఆదేశాల మేరకు అశ్వరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి...
error: Content is protected !!