ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

గంజాయి అక్రమ దందాపై మరిపెడ పోలీసుల ఉక్కుపాదం…  రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్…

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతి నిధి :

మరిపెడ గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై మరిపెడ పోలీసులు ఉక్కుపాదం మోపారు. తొర్రూరు రోడ్డులోని మరిపెడ శివారు డబుల్ బెడ్‌రూం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద తనిఖీ చేయగా సుమారు రూ.లక్ష విలువైన 2 కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు, డిజిటల్ వెయింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు గంజాయిని చిన్నప్యాకెట్లుగా తయారుచేసి మరిపెడ, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం ప్రాంతాల్లో విక్రయించేందుకు సిద్ధమైనట్లు విచారణలో వెల్లడైంది. ఈ..కేసులో పవార్ విజయ్, కంది అభిరామ్, బానోత్ మణిదీపక్‌ లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

గంజాయి రవాణా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరిపెడ సీఐ ఎల్ పవన్ కుమార్ హెచ్చరించారు. గంజాయి సంబంధిత సమాచారం అందించిన వారికి రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో మరిపెడ ఎస్‌ఐ గండ్రాతి సతీష్‌ తోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Latest Articles

Related Articles

మురసు తుఫాన్ ఉగ్రరూపం.. నేలమట్టమైన పంటలు.. బోరుమంటున్న అన్నదాతలు!  * చేతికొచ్చిన పంట వర్షార్పణం.. జూలూరుపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్  * అనంతారంలో ఈదురుగాలులకు కూలిన చెట్లు.....

జూలూరుపాడు/అనంతారం (పొలిటికల్ పవర్ సమాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక):మురసు తీవ్ర తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టించాయి. ముఖ్యంగా భద్రాద్రి...

మహబూబాబాద్‌లో పట్టపగలే భారీ చోరీ..! 5 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.5 లక్షల నగదు అపహరణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :మహబూబాబాద్: జిల్లా నవంబర్ 4 మహబూబాబాద్ పట్టణంలోని రాహుల్‌నగర్ కాలనీలో పట్టపగలే భారీ చోరీ...

*బేతుపల్లి చెరువు ఘటనపై మంత్రి పొంగులేటి నిరంతర పర్యవేక్షణ* * కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా..  *ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం.. గంటలోగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు*

  *ఖమ్మం పొలిటికల్ పవర్ ప్రతినిధి :*సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పరిస్థితిపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార...
error: Content is protected !!