ePaper
Thursday, November 5, 2026
📄 ePaper

మహబూబాబాద్‌లో పట్టపగలే భారీ చోరీ..! 5 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.5 లక్షల నగదు అపహరణ

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక మాలోత్ అజయ్ నాయక్ గార్ల మండలం ప్రతినిధి :

మహబూబాబాద్: జిల్లా నవంబర్ 4 మహబూబాబాద్ పట్టణంలోని రాహుల్‌నగర్ కాలనీలో పట్టపగలే భారీ చోరీ చోటుచేసుకుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో భద్రపరిచిన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించారు.

బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో ఉన్న సుమారు 5 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.5 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తాళం పగలగొట్టి ఉండటాన్ని, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించి చోరీ జరిగినట్లు గుర్తించారు.

వెంటనే బాధిత కుటుంబ సభ్యులు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

పట్టణంలోని నివాస ప్రాంతంలో భారీ చోరీ జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను త్వరితగతిన గుర్తించి, అపహరణకు గురైన సొత్తును స్వాధీనం చేసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను కోరుతున్నారు.

Latest Articles

Related Articles

*బేతుపల్లి చెరువు ఘటనపై మంత్రి పొంగులేటి నిరంతర పర్యవేక్షణ* * కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలపై ఆరా..  *ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం.. గంటలోగా ఒడ్డుకు చేర్చేందుకు చర్యలు*

  *ఖమ్మం పొలిటికల్ పవర్ ప్రతినిధి :*సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ప్రవహిస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పరిస్థితిపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార...

ప్రవళిక ప్రాణం తీసింది ఎవరు? చిల్లర కోసం మొదలైన గొడవ.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కోసం జరిగే గొడవలు...

నందికొట్కూరు వేదికగా కదిలిన రాజకీయం.. వైఎస్సార్‌సీపీ సత్తా చూసి ముగ్ధులవుతున్న జనం! కూటమికి ‘96’ దక్కొచ్చు.. కానీ నైతిక గెలుపు వైసీపీ దే

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* నిన్నటి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త...
error: Content is protected !!