పట్టణ, మండల ప్రజలకు జూపల్లి దంపతుల శుభాకాంక్షలు
మట్టి గణపతులను పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ సెప్టెంబర్ 14 2026: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ జూపల్లి శశికళమ్మ, వైస్ చైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు పట్టణ, మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని జూపల్లి దంపతులు పిలుపునిచ్చారు. వినాయకుడి ఆశీస్సులతో పట్టణ, మండల ప్రజల జీవితాల్లో శుభాలు, సంతోషాలు నిండాలని ఆకాంక్షించారు.


