రాజకీయంగా ఎదుర్కోలేకే నిరసనలకు దిగుతున్నారు
బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 14 2026: కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ పార్టీ నాయకులే ధర్నాలు, నిరసనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి విమర్శించారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకులు ధర్నాలు, నిరసనల పేరుతో రోడ్డెక్కుతున్నారని ఆరోపించారు.అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లో ఉన్నప్పటికీ, రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనే స్థైర్యం లేక ఆందోళన కార్యక్రమాలకు దిగడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తూ, నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి నెలకొంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు సకాలంలో సాగునీరు అందించి పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో స్పష్టమైన కార్యాచరణ ప్రకటించి, అవసరమైన నీటిని విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.రైతుల సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం, రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం కావడం సరికాదన్నారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సాగునీటి సరఫరాపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీటిని అందుబాటులోకి తీసుకురావాలని అల్వాల వెంకట్ రెడ్డి కోరారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ మాదిరిగా ధర్నాలు, నిరసనలు చేయడం విడ్డూరంగా ఉందని అల్వాల వెంకట్ రెడ్డి అన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాల్సిన అంశాలను రోడ్లపై ఆందోళనల ద్వారా ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ, వాస్తవ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు.చావు డప్పులతో చావును కోరుకోవడం ఏంటని ప్రశ్నించిన ఆయన, కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యంతో ముందుకు రావాలని అన్నారు. రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించి, ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేక ధర్నాలు, నిరసనల పేరుతో ప్రజలను పక్కదారి పట్టించడం మానుకోవాలని అల్వాల వెంకట్ రెడ్డి సూచించారు.


