ePaper
Wednesday, October 28, 2026
📄 ePaper

ఘనంగా తుంగతుర్తి రవి జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు, అభిమానులు  నోటు పుస్తకాలు, పెన్నులు బహుమతిగా అందించారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తుంగతుర్తి రవి 

📰 Generate e-Paper Clip

 

మేడిపల్లి: 26 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ

 

మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆర్ వి ఫౌండేషన్ తుంగతుర్తి రవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు , మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్,రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్,జిల్లా కమిటీ సభ్యులు,పలు డివిజన్ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యాపార ప్రముఖులు, డివిజన్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని తుంగతుర్తి రవిని ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నోటు పుస్తకాలు, పెన్నులు బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండి రాజకీయ, వ్యాపార రంగంలో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు చేయాలని ఆకాంక్షించారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా ప్రత్యక్షంగా, సోషల్ మీడియా మాధ్యమం ద్వారా, శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ తన కోరిక మేరకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, బహుమతిగా అందించిన కాంగ్రెస్ నేతలకు ,కార్యకర్తలకు, మేడిపల్లి ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Latest Articles

అంగన్వాడి విద్యార్థి పాముకాటుతో మృతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ...

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి:ఇల్లందు సబ్‌జైలును సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి స్వరూప కాటం

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు చిన్నాభిన్నం కావొద్దుఇల్లందు, పొలిటికల్ పవర్: ఖైదీలు...

బేటి బచావో బేటి పడావో అవగాహన సదస్సు

నాంపల్లి మండలం పొలిటికల్ పవర్ నాంపల్లి మండలం జడ్పీహెచ్ఎస్ పాఠశాలో బేటి బచావో...

Related Articles

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?

ముత్యాలంపాడు వంతెన రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది?వంతెన ,రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి: సర్పంచ్ కల్లూరి కిషోర్అశ్వారావుపేట పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ 9టీవీ న్యూస్...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశించినా ట్రాక్టర్ లోన్ మంజూరులో జాప్యం!

 ఎంపీడీవో, కార్యదర్శి స్పందించాలి — సర్పంచుల సంఘం అధ్యక్షుడు కిన్నెర వెంకన్న డిమాండ్పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్...

జడ్.పి.హెచ్.పాఠశాలలో పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

మేడిపల్లి : 27 అక్టోబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ పిల్లలకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రయత్నించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్ సూచించారు. మంగళవారం బోడుప్పల్ జిల్లా పరిషత్ పాఠశాలలో పోక్సో చట్టం–2012పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ జడ్జి బాలభాస్కర్, జిల్లా పోలీసు అధికారి ప్రియాంక, మేడిపల్లి పోలీస్ స్టేషన్ సీఐ డీ. జలేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు విద్యార్థులకు పోక్సో చట్టం–2012లోని ముఖ్య నిబంధనలు, కీలక విభాగాల గురించి వివరించారు. చిన్న పిల్లలను తాకడంలో మంచి–చెడులను ఎలా గుర్తించాలో, పిల్లల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.లైంగిక వేధింపులకు గురైతే భయపడకుండా వెంటనే పోలీసులకు, తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. 18 ఏళ్ల లోపు బాలికలను వేధింపులకు గురిచేస్తే అది పోక్సో చట్టం పరిధిలోకి వస్తుందని తెలిపారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ మహిళలు, బాలికల భద్రతను కాపాడటంలో షీ టీమ్స్ పాత్ర కీలకమని అధికారులు పేర్కొన్నారు. వేధింపులను నివారించే చర్యలు, ఫిర్యాదు చేసే విధానం గురించి కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లల రక్షణ, చట్టపరమైన హక్కులు, లైంగిక నేరాల నివారణపై సమాజంలో అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పోలీసు అధికారులు తెలిపారు. పిల్లల భద్రత కోసం అందరూ విజిలెన్స్‌గా వ్యవహరించాలని ఏదైనా అనుమానాస్పద ఘటన జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
error: Content is protected !!