విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, షూస్ పంపిణీ
ఎమ్మెల్యే జారే ఆదేశాలతో కార్యక్రమం
పంపిణీ చేసిన వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్టు 20 2026: విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంలో భాగంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పాఠశాల బ్యాగులు, షూస్ పంపిణీ చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా జూపల్లి రమేష్‌బాబు మాట్లాడుతూ… విద్యార్థులు విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి అందించడం ద్వారా వారి తల్లిదండ్రులపై కొంత ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. విద్యా సామగ్రి అందుకున్న విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమైంది. చదువుకు అవసరమైన వస్తువులు అందించడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. తల్లిదండ్రులు కూడా ప్రభుత్వానికి, కార్యక్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల యువజన నాయకుడు జూపల్లి ప్రమోద్, అశ్వారావుపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నండ్రు రమేష్, వినాయకపురం సర్పంచ్ కోవాసి రాజు, నరాల శ్రీనివాసరావు, నల్లపు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.



