పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 2026: పెద్దమందడి మండలంలోని చికరుచెట్టు తండా అంగన్‌వాడీ కేంద్రంలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర మహిళా మోర్చా పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రం ద్వారా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం సక్రమంగా పంపిణీ అవుతోందా అనే అంశాలను పరిశీలించారు. అంగన్‌వాడీ టీచర్ చిట్టేమ్మ ఆధ్వర్యంలో కేంద్రంలోని చిన్నారులు, తల్లులకు అందుతున్న పౌష్టికాహారం, దాని వినియోగం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, కార్యక్రమ కన్వీనర్, గ్రామ సర్పంచ్ లలిత కిషన్ నాయక్ ఆధ్వర్యం వహించారు. కార్యక్రమంలో వక్తగా పాల్గొన్న వనపర్తి జిల్లా బీజేపీ మహిళా మోర్చా మాజీ అధ్యక్షురాలు అశ్విని రాధ మాట్లాడుతూ… చిన్నారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం అందించడం అత్యంత ముఖ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ సక్షం అంగన్‌వాడీ అండ్ పోషణ్ 2.0 ద్వారా అర్హులైన చిన్నారులు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారంతో పాటు ఆరోగ్యం, పోషకాహార అవగాహన తదితర సేవలు అందుతున్నాయని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్యం, పోషక స్థితిని పర్యవేక్షించడం, అవసరమైన వారికి సంబంధిత ఆరోగ్య సేవలకు రిఫర్ చేయడం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. పౌష్టికాహారం అర్హులైన ప్రతి ఒక్కరికీ సక్రమంగా అందేలా సంబంధిత సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్థులు, మహిళలు, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

