ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిచీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెద్దాం

చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెద్దాం

📰 Generate e-Paper Clip

ధైర్యం కోల్పోనియవద్దు – వారు ఒంటరి కాదు సమాజం అండగా ఉంధాం

ప్రపంచ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ డే సందర్బముగా 

పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 17 2026: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ డే ఆదివారం సాయంత్రం 6 గంటల కు జరిగింది. ఈ సందర్బంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ పాల్గొన్ని మాట్లాడారు.

చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెద్దాం. వారిని ద్యర్యాన్ని కోల్పొనీయవద్దు. వారికి తొడుగా సమాజం నీలబదుద్దాం అన్నారు. ఎయిడ్స్ అనేది ఇప్పుడు నియంత్రించగలిగే ఒక ఆరోగ్య పరిస్థితి. బీపీ, చక్కెర వ్యాధి లాగా ఎయిడ్స్ కుడా ఓక ధీర్గ కాల వ్యాధి సరైన మందులు, ఏ ఆర్ టీ చికిత్సతో మీరు కూడా సాధారణ జీవితం గడపవచ్చు. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించండీ. వ్యాధి వచ్చిందని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు కుటుంబానికి, సమాజానికి ఎంతో విలువైనవారు. మీ ప్రేమ, మీ నైపుణ్యం, మీ కలలు అన్నీ ముఖ్యమైనవే. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ బాధ్యత. పోషకాహారం తీసుకోండి, మందులు వేళకు వేసుకోండి, పరిశుభ్రంగా ఉండండి. మీ నుండి ఇతరులకు వ్యాపించకుండా డాక్టర్ సూచించిన జాగ్రత్తలు తప్పక పాటించండి. బాధను గుండెల్లో దాచుకోవద్దు. నమ్మకమైన వ్యక్తులతో, కౌన్సెలర్లతో మాట్లాడండి. మాట పంచుకుంటే భారం తగ్గుతుంది.

మీకు నచ్చిన పని చేయండి, చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించండి. వైద్య శాస్త్రం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఆశను వదలకండి. ప్రతి ఒకరు కుడా ఎయిడ్స్ రోగులను భాదతో చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తీసుకు రావటం ప్రపంచ క్యాండిల్ లైట్ డే లక్ష్యం.కావున్న ఎయిడ్స్ రోగులను గౌరవిద్దాం. ఈ వ్యాధి తాకడం వల్ల, కలిసి తినడం వల్ల, దగ్గడం వల్ల రాదు. అపోహలు వీడండి. వ్యాధిగ్రస్తుల పట్ల ప్రేమతో, దయతో మెలగడం మనందరి బాధ్యత అన్నారు. ఈ ప్రోగ్రామ్ లోప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు 43వ ప్రవతుల ర్యాలీ ప్రదర్శన ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. డాక్టర్ వంశీకృష్ణ సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ సి ఎస్ ఓ రవి రవీందర్ రెడ్డి డాక్టర్ బండారు శ్రీనివాస్ హోప్ ఎన్ జీవో శేఖర్ శివకుమార్ గుర్నాథ్ గౌడ్ శివాని, భాగ్య. పద్మ మరియు ట్రాన్స్ జెండర్స్ తేజస్విని, సంయుక్త, భాస్కర్ వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు.

 

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!