
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గర్వకారణం – న్యాయరంగంలో మరో అరుదైన ఘనత
సాధారణ రైతు కుటుంబంలో జన్మించి, స్వీయ కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిబద్ధత, న్యాయపట్ల అంకితభావంతో న్యాయవాద వృత్తిలో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరుకున్న శ్రీ పత్తి విష్ణువర్ధన రెడ్డి ని తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా అధికారికంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, తెలంగాణ న్యాయవాద సమాజానికి గర్వకారణమైన విషయం.
దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ న్యాయవాద అనుభవం కలిగిన పత్తి విష్ణువర్ధన రెడ్డి హైకోర్టు నుంచి జిల్లా న్యాయస్థానాల వరకు నిరంతరం న్యాయ సేవలు అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.
తన ప్రతిభ, న్యాయపరిజ్ఞానం, నిజాయితీ, వృత్తిపట్ల నిబద్ధతతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ హైకోర్టుకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా ఉన్నతమైన బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం దేశ భద్రతకు, జాతీయ ప్రాధాన్యతకు సంబంధించిన కీలక కేసుల దర్యాప్తు చేసే జాతీయ దర్యాప్తు సంస్థ (N.I.A) తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసెక్యూటర్ ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించి న్యాయరంగంలో విశిష్టమైన గుర్తింపు పొందారు.
న్యాయవాదుల హక్కులు, సంక్షేమం కోసం విశేష కృషి
పత్తి విష్ణువర్ధన రెడ్డి న్యాయ ప్రస్థానం కేవలం కోర్టు వాదనలే కాకుండా న్యాయవాదుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన విశేషంగా కృషి చేశారు.
బార్ కౌన్సిల్ అఫ్ ఇండియా మెంబర్ గా , అలాగే నియమాల కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ న్యాయవాదుల సమస్యలు, హక్కులు, సంక్షేమానికి సంబంధించిన అనేక అంశాల్లో చురుకైన పాత్ర పోషించారు.
అదేవిధంగా దేశంలోని ప్రతిష్టాత్మక న్యాయ విద్యాసంస్థలైన నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం తదితర జాతీయ న్యాయ విద్యాసంస్థల విద్యా సంబంధిత కార్యకలాపాల్లో భాగస్వామిగా సేవలందించారు.
డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాది హోదా – విశిష్టమైన గౌరవం
డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందడం సాధారణమైన హోదా కాదు. ఒక న్యాయవాది యొక్క సుదీర్ఘ వృత్తి అనుభవం, న్యాయపరిజ్ఞానం, వాదనా సామర్థ్యం, వృత్తిపరమైన ప్రతిష్ఠ, నైతిక విలువలు, న్యాయరంగానికి చేసిన సేవలు వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అందించే ప్రత్యేకమైన గౌరవం.
శ్రీ పత్తి విష్ణువర్ధన రెడ్డి కూడా నిర్దేశిత ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూకు హాజరై, సంబంధిత కమిటీ పరిశీలనకు లోనై, కమిటీ సంతృప్తి మరియు తదుపరి హైకోర్టు ఆమోద ప్రక్రియ అనంతరం డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందడం ఆయన దాదాపు మూడు దశాబ్దాల న్యాయ ప్రస్థానానికి లభించిన అరుదైన గౌరవంగా చెప్పవచ్చు.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన స్వీయ కృషిని బలంగా, క్రమశిక్షణను ఆయుధంగా, పట్టుదలను మార్గదర్శకంగా, న్యాయపట్ల నిబద్ధతను తన స్ఫూర్తిగా చేసుకుని దాదాపు మూడు దశాబ్దాల న్యాయ ప్రస్థానంలో ఇంతటి ఉన్నతమైన గుర్తింపును సాధించడం నిజంగా స్ఫూర్తిదాయకం.ఇది కేవలం శ్రీ పత్తి విష్ణువర్ధన రెడ్డి వ్యక్తిగత విజయమే కాదు — ఆయన పుట్టి పెరిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, తెలంగాణ న్యాయవాద సమాజానికి గర్వకారణమైన ఘట్టం.
భవిష్యత్తులో ఆయన తన అపారమైన న్యాయ అనుభవాన్ని న్యాయ పరిరక్షణ, సామాజిక న్యాయం, న్యాయవాదుల సంక్షేమం, యువ న్యాయవాదులకు మార్గదర్శకత్వం మరియు సమాజ ప్రయోజనానికి సంబంధించిన న్యాయపరమైన అంశాల కోసం మరింత విస్తృతంగా వినియోగించాలని ఆకాంక్షిద్దాం.
తెలంగాణ హైకోర్టు డిజిగ్నేటెడ్ సీనియర్ న్యాయవాదిగా గుర్తింపు పొందిన శ్రీ పత్తి విష్ణువర్ధన రెడ్డి హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.
ఆయన న్యాయపరిజ్ఞానం మరింత మందికి మార్గదర్శకంగా నిలవాలి…
ఆయన అనుభవం సమాజానికి మరింత ఉపయోగపడాలి…
న్యాయ సేవలో ఆయన ప్రస్థానం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి…
“స్వీయ కృషితో సాధించిన స్థానం — న్యాయ సేవతో పొందిన గౌరవం — సమాజ సేవతో సార్థకం చేసుకునే స్ఫూర్తిదాయక ప్రస్థానం.”
శ్రీ పత్తి విష్ణువర్ధన రెడ్డి కి మరోసారి పొలిటికల్ పవసమగ్ర జాతీయ దిన పత్రిక తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు. ⚖️💐

