ePaper
Tuesday, September 22, 2026
📄 ePaper

ఐదేళ్ల చీకట్లకు చెక్‌.. యార్లగడ్డ భాస్కర్ రావు కాలనీలో విద్యుత్ వెలుగులు

📰 Generate e-Paper Clip

మాటల్లో కాదు.. చేతల్లో చూపించిన ఎమ్మెల్యే జారే

నిరుపేదల దశాబ్దాల కల సాకారం.. కాలనీలో విద్యుత్ వెలుగులు

కాలనీవాసుల కష్టాలకు పరిష్కారం.. కొత్త విద్యుత్ లైన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారేపొలిటికల్ పవర్, దమ్మపేట, సెప్టెంబర్ 20:దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల కల నెరవేరింది. దమ్మపేట మండలం మల్లారం గ్రామ సమీపంలోని యార్లగడ్డ భాస్కరరావు కాలనీలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో నూతన విద్యుత్ లైన్, విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు ఏర్పాటు చేశారు. నూతన విద్యుత్ సౌకర్యాన్ని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వయంగా ప్రారంభించారు.

గత ఐదేళ్లుగా విద్యుత్ స్తంభాలు, వీధిదీపాలు లేక కాలనీవాసులు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు చీకటి కారణంగా అవస్థలు పడేవారు. కాలనీవాసుల సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.పనులు పూర్తయిన అనంతరం కాలనీలో నూతన విద్యుత్ లైన్, వీధిదీపాలను ప్రారంభించడంతో కాలనీ మొత్తం విద్యుత్ వెలుగులతో కళకళలాడింది. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం తన బాధ్యత అన్నారు. యార్లగడ్డ భాస్కరరావు కాలనీలో విద్యుత్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవతో పరిష్కరించడంపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. తమ ఇళ్లలో వెలుగులు నింపిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు, సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబుకు కాలనీవాసులు, ప్రజాప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Latest Articles

ఆకలితో ఎవ్వరూ బాధపడకూడదు.. అన్ని దానాలు కన్నా అన్నదానం మిన్న

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు...

దానధర్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో 75 మంది గర్భిణులకు సామూహిక సీమంతం

ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్‌ఎస్‌  నాయకులు సోయం వీరభద్రం పొలిటికల్ పవర్,దమ్మపేట, సెప్టెంబర్ 21:...

” సమ్మక్క-సారక్క అంతర్జాతీయ విమానాశ్రయం”గా నామకరణం చేయాలి

తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక వైభవానికి, చారిత్రక వారసత్వానికి, వీరత్వానికి ప్రతీక. కాకతీయుల...

అగ్ని ప్రమాద బాధితులకు అండగా శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

” సమ్మక్క-సారక్క అంతర్జాతీయ విమానాశ్రయం”గా నామకరణం చేయాలి

తెలంగాణ రాష్ట్రం సాంస్కృతిక వైభవానికి, చారిత్రక వారసత్వానికి, వీరత్వానికి ప్రతీక. కాకతీయుల పరిపాలనలో చారిత్రక వైభవంతో విలసిల్లిన వరంగల్ నగరం, నేడు విద్యా, వైద్య, ఆర్థిక రంగాలు మరియు మౌలిక వసతుల కల్పనలో...

ఒక్క పుట్టినరోజు కోసం ఒక జీవితాన్నే కోల్పోవాలా..?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*🚨 ఒక్క బర్త్‌డే కోసం... ఒక జీవితాన్ని కోల్పోవాలా?💔...

ములకలపల్లిలో తాటి విస్తృత పర్యటన

వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు.ఘనంగా సన్మానించిన ఉత్సవ కమిటీలుపొలిటికల్ పవర్,ములకలపల్లి, సెప్టెంబర్21: వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న నేపథ్యంలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు...
error: Content is protected !!