ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్దేవరపల్లిలో పొగాకు రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ అండ – ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

దేవరపల్లిలో పొగాకు రైతుల ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ అండ – ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు

📰 Generate e-Paper Clip

– నిరసనలో పాల్గొన్న అనపర్తి వైయస్ ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త మాజీ ఎమ్మోల్య్ సూర్యనారయణరెడ్డి

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే06:

దేవరపల్లి: వర్జీనియా పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేవరపల్లిలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ నాయకులు మాట్లాడుతూ, గత 40 రోజులలో కేవలం 1 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేయడం బాధాకరమని అన్నారు. ఒకవైపు సుమారు 80 వేల మిలియన్ కిలోల ఉత్పత్తి ఉన్నప్పటికీ, రైతులకు సరైన ధర లభించకపోవడం అన్యాయమని విమర్శించారు.
ప్రతి ఏడాది పొగాకు మరియు దాని ఉత్పత్తులపై లక్షల కోట్ల రూపాయల పన్నుల రూపంలో ప్రభుత్వం భారీ ఆదాయం పొందుతున్నప్పటికీ, అదే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో నిర్లక్ష్యం చూపడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఫలితంగా రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా తక్షణ కొనుగోళ్లు ప్రారంభించి రైతులకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల చెమటకు తగిన విలువ ఇవ్వాలని, వెంటనే కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!