ePaper
Thursday, June 4, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిదేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి

దేవాదాయ శాఖ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి

📰 Generate e-Paper Clip

చిన్నా రెడ్డినీ సన్మానించిన నూతన కార్యనిర్వహణాధికారులు.

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే17 2026: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా నూతనంగా 190 కార్యనిర్వహణాధికారి (ఈఓ)పోస్టులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సందర్భంగా కేబినెట్ లో ఫైల్ ఆమోదం తెలిపే విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ఫైలు మంత్రి వర్గ ఆమోదం పొందే విధంగా కృషి చేసిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డినీ కార్యనిర్వహణాధికారులు ఆదివారం చిన్నారెడ్డి వారి నివాసంలో చిన్నారెడ్డికి పూల బొకే ఇచ్చి శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్బంగా డాక్టర్ జిల్లెల్ల చిన్నా రెడ్డి మాట్లాడుతూ… ఎన్నో ప్రాచీన ఆలయాలకు తగిన నిర్వహణ అధికారులు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో నూతన 190 పోస్టుల మంజూరీతో పరిపాలన గాడిలో పడే అవకాశం కలదు.అలాగే వేల కోట్ల ఆస్తులు కాపాడే అవకాశం కలదని అన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యనిర్వహణాధికారులు బాధ్యతగా విధులు నిర్వహించి దేవాదాయ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం రాష్ట్ర నాయకులు జనుంపల్లి జయపాల్ రెడ్డి, ప్రసాద్,శ్రీనివాస్ గౌడ్, యుగంధర్ రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీమాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, వనపర్తి పట్టణ ప్రధాన కార్యదర్శి బాబా, వనపర్తి మండల్ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు ఎత్తం చరణ్ రాజ్, ఎంట్ల రవి, సోషల్ మీడియా రాజు, తదితరులు పాల్గొన్నారు.

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!