
//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి ఎల్లస్వామి టేకుమట్ల//
టేకుమట్ల మండలం పెద్దంపల్లి గ్రామానికి చెందిన జక్కుల రవి గంధం లావణ్య వద్ద ఆరు లక్షలు రూపాయలు అప్పు తీసుకొని డబ్బులు.అడుగగా ఇవ్వడం లేదని లావణ్య తమ్ముడు అయినా జక్కుల కుమార్ పెద్ద మనుషుల సమక్షంలోకి జక్కుల రవిని పిలిపించి మాట్లాడగా డబ్బులు చెల్లించినాడు సమస్య క్లియర్ అయినది ఇట్టి విషయంలో జక్కుల రవి, జక్కుల కుమార్ కుటుంబ సభ్యులను నానాబూతులు తిట్టగా జక్కుల రాజయ్య ఎందుకు తిడుతున్నావ్ అని అడిగితే జక్కుల రవి నెట్టివేయగా క్రిందపడి .కాలు విరిగినది ఇట్టి విషయంలో ఈ రోజు జక్కుల రవి ని అరెస్టు చేసికోర్టుకు హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించినదని టేకుమట్ల SI G. అమూల్య తెలిపారు,, చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి ఆవేశపడి తిట్టుకొని కొట్టుకొని కేసులపాలై జీవితాలను ఇబ్బందులకు గురి చేసుకోవద్దని సూచించారు.

