ePaper
Thursday, September 17, 2026
📄 ePaper

పామిరెడ్డిపల్లిలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

📰 Generate e-Paper Clip

స్వచ్ఛతా హి సేవపై విద్యార్థులకు అవగాహనపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని పామిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజాం పాలనలో రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన అమరవీరులను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను అందించేందుకు పోరాడిన వీరయోధులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వచ్ఛతా హి సేవ కార్యక్రమం ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు, ఇళ్ల చుట్టుపక్కల ప్రాంతాలు, రహదారులు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరిశుభ్రమైన గ్రామం కోసం ప్రజలు, విద్యార్థులు కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి స్రవంతి, ఉపసర్పంచ్ పానుగంటి రాములమ్మ, ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, వార్డు సభ్యులు కావలి యాదమ్మ, పద్మమ్మ, పాఠశాల విద్యార్థులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ తిక్కన్న, భీమిరెడ్డి, కొంకలి నరసింహ, పానుగంటి వెంకటయ్య, పానుగంటి హనుమంతు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం

పెద్దమందడి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వేడుకలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: పెద్దమందడి ప్రభుత్వ జూనియర్...

బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలి -డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 17 2026: బీసీ హాస్టల్ విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించాలని బీసీ...

గిరిజనుల రిజర్వేషన్లను 6 నుండి 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి దక్కుతుంది

–  గిరిజన నాయకుల, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజనులు, గిరిజన నాయకులు,పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...
error: Content is protected !!