ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిపోలీసుల సేవలకు ఘన సన్మానం

పోలీసుల సేవలకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 21 2026: పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ, నాభి, పోచమ్మ అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో పెద్దమందడి ఏఎస్ఐ శ్రీనివాస్ శర్మ, కానిస్టేబుల్ రాకేష్ సమర్థవంతంగా విధులు నిర్వహించారు. వారి సేవలను గ్రామ ప్రజలు ప్రత్యేకంగా గుర్తించి అభినందించారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగేందుకు పోలీసులు అందించిన సహకారం ప్రశంసనీయమని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. పోలీసుల విధి నిర్వహణతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమం సజావుగా సాగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగేష్ ఆధ్వర్యంలో ఏఎస్ఐ శ్రీనివాస్ శర్మ, కానిస్టేబుల్ రాకేష్‌ను ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దలు, ప్రజలు పోలీసు సిబ్బందికి అభినందనలు తెలియజేస్తూ వారి సేవలను కొనియాడారు. ప్రజల భద్రతకు పోలీసులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!