
ఖమ్మం (పాలేరు) / ప్రత్యేక ప్రతినిధి: నాగరాజు రెడ్డి
ప్రజల కష్టసుఖాల్లోనూ, శుభకార్యాల్లోనూ తాము ఎప్పుడూ ముందే ఉంటామని కాంగ్రెస్ పార్టీ మరోసారి నిరూపించింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని 59వ డివిజన్ దానవాయిగూడెం గ్రామంలో బుధవారం సందడి వాతావరణం నెలకొంది. గ్రామంలో నిర్వహించిన రెండు వేర్వేరు శుభకార్యాలకు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కార్పొరేషన్ జనరల్ సెక్రటరీ ‘చల్లా కృష్ణ’ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.
చిన్నారి అన్నప్రాసన వేడుకల్లో..
దానవాయిగూడెం గ్రామానికి చెందిన మద్దెల పిచ్చయ్య – సుందరమ్మ గార్ల చిన్న కుమార్తె కూతురి అన్నప్రాసన కార్యక్రమానికి చల్లా కృష్ణ ప్రత్యేకంగా హాజరయ్యారు. చిన్నారికి మిఠాయిలు తినిపించి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
పంచల వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ..
అలాగే, అదే గ్రామానికి చెందిన పడిశాల సతీష్ – భవాని దంపతుల కుమారుల సాంప్రదాయ ‘పంచ కట్టు’ వేడుకల్లో కూడా చల్లా కృష్ణ పాల్గొన్నారు. చిన్నారులకు కానుకలు అందించి, ఆశీస్సులు అందజేశారు. నాయకుడు తమ ఇంటి వేడుకకు వచ్చి ఆశీర్వదించడంతో ఆయా కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి.
కార్యకర్తల్లో నూతనోత్సాహం:
ప్రజాభిమానమే ఊపిరిగా, డివిజన్ స్థాయిలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే నాయకుడు చల్లా కృష్ణ రాకతో స్థానిక కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. పార్టీ బలోపేతానికి, ప్రజలతో అనుబంధానికి ఇలాంటి కార్యక్రమాలు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చల్లా కృష్ణతో పాటు 59వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

