– బాధితులకు సత్వర న్యాయం అందించడంలో రాజీపడొద్దని పోలీసు అధికారులకు స్పష్టమైన సూచన చేసిన జిల్లా ఎస్పీ.డి. సునీత రెడ్డి,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.03. 2026. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా బాధితులకు సత్వర న్యాయం అందించాలని, బాధితులకు సత్వర న్యాయం అందించడంలో రాజీపడొద్దని పోలీసు అధికారులకు స్పష్టమైన సూచన చేసిన జిల్లా ఎస్పీ.డి. సునీత రెడ్డి అన్నారు.ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 15 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి ఐపీఎస్ నేరుగా వినిపించారు.ప్రతి ఫిర్యాదును జిల్లా ఎస్పీ స్వయంగా శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై చట్టబద్ధంగా, పారదర్శకంగా మరియు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిగణించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులను స్పష్టం చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ. మాట్లాడుతూ ప్రజల సమస్యలను వినడం మాత్రమే కాకుండా, వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడమే ప్రజావాణి నిర్వహణ యొక్క అసలు ఉద్దేశ్యం. ప్రతి ఫిర్యాదును సున్నితంగా పరిశీలించి, బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు బాధ్యతాయుతంగావ్యవహరించాలనిసూచించారు.జిల్లా ఎస్పీ తక్షణ స్పందన, సమస్యల పరిష్కారానికి చూపిన చొరవపై ప్రజావాణికివచ్చినఫిర్యాదుదారులు హర్షం వ్యక్తం చేస్తూ, తమకున్యాయంజరుగుతుందనే పూర్తి విశ్వాసం కలిగిందని తెలిపారు. ప్రజావాణిలో అందిన 15 ఫిర్యాదుల వివరాలు 02 – భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన ఫిర్యాదలు 04 – భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు
09 – పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని ఆమె తెలిపారు.


