ePaper
Saturday, September 26, 2026
📄 ePaper

బలభద్రపురంలో పంట పొలాలకు తుపాను దెబ్బ

📰 Generate e-Paper Clip

 

ముంపు ప్రాంతాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి – రైతులను ఆదుకోవాలని డిమాండ్

బిక్కవోలు      సెప్టెంబర్  25:
వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఊర చెరువు పరిసరాల్లోని వందల ఎకరాల వరి పంటలు నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ముంపు పరిస్థితులను పరిశీలించేందుకు అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బలభద్రపురంలో పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి ముంపునకు గురైన వీధులు, వ్యవసాయ భూములను పరిశీలించారు. మాజీ సర్పంచ్ మల్లిడి అబ్బాయిరెడ్డి వీధిలో నిలిచిన మురుగునీటిని పరిశీలించి, నీరు బయటకు వెళ్లకపోవడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా కొత్త చెరువు సమీపంలో సుమారు 25 ఎకరాల్లో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. గత వేసవిలో చెరువు గట్టును ఎత్తుగా నిర్మించడం వల్ల వర్షపు నీరు సక్రమంగా చెరువులోకి వెళ్లే మార్గం దెబ్బతిన్నదని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వర్షపు నీరు పొలాలు, నివాస ప్రాంతాల వైపు చేరుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. సరైన ప్రణాళిక లేకుండా చేపట్టిన పనుల కారణంగా రైతులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంట పొలాలు ముంపునకు గురికావడం ఆందోళనకరమన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు.
ఈ పర్యటనలో గ్రామ శాఖ అధ్యక్షుడు కొవ్వూరి వెంకట రామారెడ్డి, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు సబ్బెళ్ల సుజాత వీరరాఘవరెడ్డి, మేడపాటి ఆనందరెడ్డి, నాయకులు నల్లమిల్లి బుల్లి రాజా వెంకటరెడ్డి, నల్లమిల్లి పుల్లారెడ్డి, గొర్రెపూడి శ్రీను, గొర్రెపూడి వెంకన్నబాబు, గుబ్బల లాజర్ బాబు, బొడ్డు శ్రీనివాసరావు, గొర్రెపూడి త్రిమూర్తులు తదితరులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Latest Articles

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్...

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.....

ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ..

 సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు...

ఏడాది పోరాటం ఫలించింది.. ఎగమాలపాడుకు రూ.2.63 కోట్ల రోడ్డు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

Related Articles

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎన్ ప్రసాద్ రావు కలసపాడు వైఎస్సార్ కడప జిల్లా.ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భాగస్వామ్య ప్రకృతి...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.. కలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు....

ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ..

 సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎం. ప్రసాదరావు. కలసపాడు. వైయస్సార్ కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండలం లోని తెల్లపాడు గ్రామపంచాయతీని...
error: Content is protected !!