ePaper
Friday, September 25, 2026
📄 ePaper

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

📰 Generate e-Paper Clip

పిడుగుపాటులో మృతిచెందిన మహిళ కుటుంబానికి ఆర్థిక సాయం.. పిల్లల భవిష్యత్తుకు అండగా ఉంటామని భరోసా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: పిడుగుపాటుకు గురై మృతిచెందిన మహిళ కుటుంబంతో పాటు ఇటీవల మృతిచెందిన పలువురి కుటుంబాలను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శుక్రవారం పరామర్శించారు. గత బుధవారం పెబ్బేరు మండలం సూగూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పిడుగుపాటుకు గురైన ఘటనలో లక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, సువర్ణ, అనురాధలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి శుక్రవారం సూగూరు గ్రామంలోని మృతురాలు లక్ష్మి నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు. లక్ష్మి పిల్లల భవిష్యత్తుకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, అవసరమైన సమయంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. గాయపడిన సువర్ణ, అనురాధలకు మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ఇటీవల మృతిచెందిన పోషమోని చంద్రయ్య కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. చంద్రయ్య చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు. తదుపరి ఇటీవల మృతిచెందిన ఆడం బాలస్వామి కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే పరామర్శించారు. బాలస్వామి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, పెబ్బేరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యాపర్ల రామిరెడ్డి, పెబ్బేరు పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, కొత్త సూగుర్ సర్పంచ్ పద్మమ్మ అర్జున్, కాంగ్రెస్ నాయకులు నరసింహనాయుడు, రంజిత్ కుమార్, యుగేందర్ రెడ్డి, వెంకటేష్ సాగర్, సురేందర్ గౌడ్, షకీల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ప్రశాంతంగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం విజయవంతంసెప్టెంబర్ 26: పొలిటికల్ పవర్ న్యూస్...

కొత్తకోట లో ఘనంగా బీజేపీ సిద్ధాంత కర్త పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110 వ. జయంతి వేడుకలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9...

పార్కలగండి ఆశ్రమ పాఠశాలఅభివృద్ధికి ఐటీడీఏ నిధులు రూ.30 లక్షలతో పనులకు శ్రీకారం

డైనింగ్ హాల్, కిచెన్ మరమ్మతులు, టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు.. సర్పంచ్ కొమరం...

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం...

బునాదిపురం రైతులతో ఎమ్మెల్యే మాటామంతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక /...

*ఆభరణాలు-ఆరోగ్య రహస్యాలు*

 *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

Related Articles

శ్రీ శ్రీ మహనంద మల్కిదేశీ కేంద్రుల ఆచల గురు ఆశ్రమం లోఘనంగా బృహస్పతి హోమం 

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.25.2026.శ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారి ఆశ్రమం వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణం లోని వాడ్డే వాటా రోడ్డు, బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానందమలికిదేశికస్వాములవారిఅచలగురుఆశ్రమంలోశ్రీపరాభవనామసంవత్సరం అధికజేష్ఠమాసం...

బునాదిపురం రైతులతో ఎమ్మెల్యే మాటామంతి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 25 2026: పెబ్బేరు మండలం బునాదిపురం రైతులతో శుక్రవారం...

విమలక్క 50 ఏళ్ల కళా ప్రస్థానానికి 50 గంటల ప్రజా కళా జాతర

వనపర్తిలో పోస్టర్‌ ఆవిష్కరించిన పలుస శంకర్‌ గౌడ్‌పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్‌ 24 2026: ప్రజా గాయని...
error: Content is protected !!