ఖమ్మం, సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు
తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లోని బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో భగవాన్ శ్రీ విశ్వకర్మ పూజా మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్పాంజలి ఘటించి, సమాజ శ్రేయస్సు, కార్మికుల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వల్లెపు సోమరాజు, సంచార జాతుల సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు, మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు శ్రమకు, నైపుణ్యానికి, సృజనాత్మకతకు ప్రతీక అని పేర్కొన్నారు. శ్రమజీవుల సేవలను సమాజం గుర్తించి గౌరవించడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇటువంటి సాంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేశారు.


