ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

మురసు తుఫాన్‌ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి!

📰 Generate e-Paper Clip

ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి

దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్

పొలిటికల్ పవర్,దమ్మపేట: మురసు తుఫాన్‌ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంట పొలాలను అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు పరిశీలించారు. దమ్మపేట మండలం నాచారం గ్రామంలో నేలకొరిగిన పంటలను, దెబ్బతిన్న వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసన్నగూడెం సమీపంలో తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న రహదారిని పరిశీలించారు.

ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మురసు తుఫాన్‌ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలల తరబడి కష్టపడి, వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి సాగు చేసిన పంట కళ్లముందే నేలకొరగడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. ఇప్పటికే పెట్టుబడి ఖర్చులు, సాగు భారంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రకృతి వైపరీత్యం మరింత నష్టాన్ని మిగిల్చిందన్నారు.

తుఫాన్‌ కారణంగా తడిసి, దెబ్బతిన్న ధాన్యాన్ని నిబంధనల పేరుతో తిరస్కరించకుండా ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి, పారదర్శకంగా నివేదికలు రూపొందించి బాధిత రైతులందరికీ న్యాయం చేయాలని సూచించారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు పంట పొలాలను సందర్శించి ఫొటోలకు పరిమితమైతే రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని విమర్శించారు. రైతుల కష్టాలను గుర్తించి తక్షణ సహాయక చర్యలు చేపట్టడంతో పాటు నష్టపరిహారం అందించినప్పుడే పర్యటనలకు సార్థకత చేకూరుతుందని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీకటి రమాదేవి, చీకటి రామయ్య, శ్రీనివాసరావు, పాకనాటి శ్రీను, మాడా సుదర్శన్‌రావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

టీ ముచ్చట్లతో పాటు పారిశుధ్యంపై అవగాహన

వ్యాపార సముదాయాలను సందర్శించి పరిశుభ్రతపై సూచనలు చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్...

ఖమ్మం జిల్లా జడ్పీ సెంటర్‌లో సంచలనం.. నిజాయితీకి నిలువెత్తు రూపం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

కొత్తకోట లో నవంబర్ 11 నుంచి అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ

– స్వాములు ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలోనే మధ్యాహ్న భిక్ష స్వీకరించాలి, వ్యక్తిగతం...

ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించిన తరువాతే ధాన్యం కేటాయించాలి

– మిల్లర్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, – వనపర్తి జిల్లా...

Related Articles

error: Content is protected !!