ePaper
Saturday, November 7, 2026
📄 ePaper

పోలింగ్ ముగిసింది.. 👉కలెక్టర్ టేబుల్‌పై జడ్పీ పీఠం భవితవ్యం..!? జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. 

📰 Generate e-Paper Clip

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

మరోవైపు విజయనగరం జిల్లా పరిషత్ పీఠం రేసులో ఉన్న మజ్జి సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.

బీసీ మహిళకు రిజర్వ్ అయిన జడ్పీ పీఠం.. సిరి సహస్ర రాజకీయ భవితవ్యంపై కొత్త చర్చకు తెరలేపింది.

ఈ రోజు జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో తెర్లాం నుంచి సిరి సహస్ర విజయం ఖాయమనే చర్చ జోరుగా సాగుతోంది. పోలింగ్ సరళి కూడా ఆమెకు అనుకూలంగా ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.

అయితే.. జడ్పీ పీఠం రేసులో ఉన్న చిన్న శ్రీను ముద్దుల కూతురు సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం వ్యవహారం ఇప్పుడు కీలకంగా మారింది.

👉జైన్ కుటుంబంలో జన్మించి.. మజ్జి శ్రీనివాసరావు దత్తత తీసుకున్న సిరి సహస్రకు జారీ చేసిన బీసీ-డీ (తూర్పు కాపు) కుల ధ్రువీకరణ పత్రంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

ఈ వ్యవహారంపై ప్రతివాదులు హైకోర్టును ఆశ్రయించగా.. కుల ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుపై తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను జిల్లా కలెక్టర్‌కు వదిలింది.

ఇదే సమయంలో.. తెర్లాం జడ్పీటీసీ స్థానం అన్‌రిజర్వుడ్ కావడంతో.. బీసీ అభ్యర్థిగా చెల్లించిన రూ.3 వేల నామినేషన్ ఫీజుకు అదనంగా మరో రూ.3 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇప్పుడు ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ.. కొందరు సిరి సహస్ర బీసీ హోదా చెల్లదంటూ ప్రచారం చేస్తున్నారు.

👉కానీ.. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి.

“మొత్తం రూ.6 వేల నామినేషన్ ఫీజు చెల్లించాలన్న హైకోర్టు ఆదేశం.. ఆమె బీసీ హోదాను రద్దు చేసినట్లు మాత్రం కాదు..!”

అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే..

దత్తత ద్వారా సిరి సహస్రకు బీసీ-డీ హోదా పొందే అర్హత ఉందా? లేదా?

ఈ ప్రశ్నకు సమాధానం తేలాల్సింది జిల్లా కలెక్టర్ విచారణలోనే.

కలెక్టర్ విచారణలో ఏం తేలుస్తారు?

సిరి సహస్ర కుల ధ్రువీకరణ పత్రం చెల్లుబాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు?

ఆమె రాజకీయ ప్రయాణానికి ఈ నిర్ణయం కీలక మలుపుగా మారుతుందా?

ఇదే ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్!

మొత్తానికి..

పోలింగ్ ముగిసింది.. ఫలితాల కోసం ఎదురుచూపులు మొదలయ్యాయి.

కానీ సిరి సహస్ర విషయంలో అసలు ఉత్కంఠ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఓట్ల లెక్కింపులో గెలుపు ఎవరిది?

కలెక్టర్ నిర్ణయంలో తేలేది ఏమిటి?

జడ్పీ పీఠం దక్కేదేవరికి…???

Latest Articles

టీ ముచ్చట్లతో పాటు పారిశుధ్యంపై అవగాహన

వ్యాపార సముదాయాలను సందర్శించి పరిశుభ్రతపై సూచనలు చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్...

మురసు తుఫాన్‌ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి!

ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు...

ఖమ్మం జిల్లా జడ్పీ సెంటర్‌లో సంచలనం.. నిజాయితీకి నిలువెత్తు రూపం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9...

కొత్తకోట లో నవంబర్ 11 నుంచి అయ్యప్ప భక్తులకు అన్నప్రసాద వితరణ

– స్వాములు ప్రతిరోజూ ఆలయ ప్రాంగణంలోనే మధ్యాహ్న భిక్ష స్వీకరించాలి, వ్యక్తిగతం...

ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించిన తరువాతే ధాన్యం కేటాయించాలి

– మిల్లర్ల అక్రమాలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి, – వనపర్తి జిల్లా...

Related Articles

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ ఖాతా తెరిచింది.ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పోరేషన్లు.. మున్సిపాల్టీల ఫలితాలను ప్రకటించారు. నవంబర్ 6 పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్తుఫాను కారణంగా...

: దేవనకొండలో ఉత్కంఠ పోరు.. రేపే పత్తికొండ కౌంటింగ్ సెంటర్‌లో అసలైన ఫైట్!

దేవనకొండ/పత్తికొండ:దేవనకొండ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ముగిసిన సమరానికి సంబంధించిన తుది ఘట్టం సమీపించింది. రేపు పత్తికొండలోని కౌంటింగ్ సెంటర్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండటంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పతాక...
error: Content is protected !!