ePaper
Tuesday, October 27, 2026
📄 ePaper

రాష్ట్రంలో ఎన్నికల పేరిట ప్రజాస్వామ్యం ఖూనీ :కూటమి ప్రభుత్వంపై గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌ గారికి వైయస్‌ జగన్‌ గారు ఫిర్యాదు

📰 Generate e-Paper Clip

 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల సందర్భంగా Story మూడు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలపై లోక్‌భవన్‌లో గవర్నర్‌ శ్రీ అబ్ధుల్‌ నజీర్‌ గారిని కలిసిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌ గారు ఫిర్యాదు చేశారు.

నామినేషన్లు వేస్తున్న వైయస్సార్‌సీపీ అభ్యర్థులపై యథేచ్ఛగా టీడీపీ గుండాల దాడి, నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, నామినేషన్‌ పత్రాలు లాక్కుని చింపేయడం, చివరకు ఆర్‌ఓల వద్ద ఉన్న నామినేషన్లు కూడా తీసుకెళ్లి చింపేయడం, పుంగనూరులో ఎంపీ మిధున్‌రెడ్డిపై హత్యాయత్నం, పైగా ఆయనపైనే కేసు నమోదు, ఎంపీ గురుమూర్తిపైనా అక్రమ కేసుల బనాయింపు, పులివెందులలో వైయస్సార్‌సీపీ అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగం, గాలిలోకి కాల్పులతో పాటు, పలుచోట్ల అక్రమ కేసులు నమోదు చేస్తున్న పోలీసులు వైయస్సార్‌సీపీ అభ్యర్థులను అరెస్టు చేస్తున్న వైనంపై సాక్ష్యాధారాలతో సహా, శ్రీ వైయస్‌ జగన్‌ గవర్నర్‌ గారికి వివరించారు. అనంతరం లోక్‌భవన్‌ వద్ద శ్రీ వైయస్‌ జగన్‌ గారు మీడియాతో మాట్లాడారు.

 

స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు అడ్డుకుంటున్నారు

ఇలాంటి సంస్కృతి దేశంలో ఎక్కడా లేదు

ఓటమి భయంతోనే అంతులేని అరాచకాలు

:శ్రీ వైయస్‌ జగన్‌ ఫైర్‌

 

అధికార పార్టీకి దాసోహమైన పోలీస్‌ వ్యవస్థ

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కూడా రాజీ పడింది

అందుకే పారా మిలటరీ బలగాలు రప్పించాలి

వారి రక్షణలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

పోలింగ్, బ్యాలెట్‌ బాక్సుల స్టోర్, ఓట్ల లెక్కింపు కేంద్రాలు

అన్ని చోట్లా సీసీ కెమెరాల ఫుటేజ్‌ లైవ్‌ ఏర్పాటు చేయాలి

నామినేషన్ల ప్రక్రియనూ ఆన్‌లైన్‌ చేయాలి

ఆ దిశలో తగిన చర్యలు తీసుకునేలా చూడండి

:గవర్నర్‌కు శ్రీ వైయస్‌ జగన్‌ విజ్ఞప్తి

 

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, డాక్టర్‌ మధుసూధన్, కల్పలతారెడ్డి, రహుల్లా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎన్టీఆర్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ తదితరులు శ్రీ వైయస్‌ జగన్‌ వెంట, గవర్నర్‌ను కలిశారు.

Latest Articles

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ నేతలతో ఎమ్మెల్యే కోరం కనకయ్య సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 తెలుగు...

ఉప్పాడ తీరంలో అలజడి..

ఎగసిపడుతున్న సముద్రపు అలలు! పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ...

వాల్మీకి జయంతికి ఎమ్మెల్యే జారె ఆర్థిక చేయూత!

ఆలయ మరమ్మతులకు రూ.20 వేల సాయం.. తూర్పు బజార్‌లో ఘనంగా వాల్మీకి...

వినాయకపురంలో మట్టి తవ్వకాలపై విచారణ జరపాలి!

అనుమతులపై స్పష్టత ఏదీ? అక్రమ తవ్వకాల ఆరోపణలపై అధికారుల స్పందన ఏది? పొలిటికల్...

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఎమ్మెల్యే మట్టా రాగమయి ఘన సన్మానం!

యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు! పొలిటికల్ పవర్...

అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి!

ఓటరు నమోదు కోసం ప్రభుత్వ కార్యాలయాల బాట పట్టిన అశ్వారావుపేట మండల...

Related Articles

39వ డివిజన్‌లో వైసీపీ విజయభేరి.. వైఎస్సార్సీపీ తుఫాన్ ప్రచారం!

  *పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*విజయవాడ 39వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్...

error: Content is protected !!