యువత భవిష్యత్తే లక్ష్యం.. సోషల్ మీడియాతో సామాజిక చైతన్యానికి పిలుపు!
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ వడితే గణేష్ అక్టోబర్ 27 2026: సోషల్ మీడియా అంటే కేవలం రీల్స్, లైక్స్, ఫాలోవర్స్ మాత్రమే కాదు.. సమాజంలో మంచి మార్పు తీసుకొచ్చే శక్తివంతమైన వేదిక కూడా! యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా సోషల్ మీడియాను వినియోగించాలని సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. అశ్వారావుపేటకు చెందిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి ఘనంగా సన్మానించారు. కొణకళ్ల ఇందు, మన్యం ప్రభుకుమార్, ఏరువాక వర్షిణి ఆహ్వానం మేరకు నిర్వహించిన ఇన్‌ఫ్లుయెన్సర్ల మీట్‌అప్‌లో ఆమె పాల్గొని పలు కీలక సూచనలు చేశారు.
పోక్సో, డ్రగ్స్‌పై అవగాహన.. విద్యకు దూరమవుతున్న విద్యార్థులకు ప్రేరణ!
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవుతున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. పోక్సో చట్టంపై అవగాహన కల్పించడం, డ్రగ్స్ బారిన పడకుండా యువతను చైతన్యపరచడం, విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా మోటివేషనల్ వీడియోలతో ప్రోత్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యత. ఇవ్వాలని కోరారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమకున్న గుర్తింపును సమాజానికి ఉపయోగపడేలా మలుచుకోవాలని, యువతలో సానుకూల ఆలోచనలు పెంపొందించే వీడియోలు రూపొందించాలని ఎమ్మెల్యే సూచించారు.


