ePaper
Sunday, August 2, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిరైతులు వర్షధార పంటల సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలి

రైతులు వర్షధార పంటల సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలి

📰 Generate e-Paper Clip

– అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్,

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 24.2026.

ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ ఆదేశించారు.గురువారం అదనపు కలెక్టర్ పెబ్బేరు మండలంలోని శాఖాపురం (వై) గ్రామం, శ్రీరంగాపూర్ మండలంలోనిశ్రీరంగాపూర్,గ్రామరైతువేదికలోనిర్వహించినఎల్‌నినో అవగాహన మరియు సన్నద్ధత కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు వర్షధార పంటల సాగును తగ్గించి, ఆరుతడి పంటల సాగు వైపు మళ్లాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులు వరి, చెరకు వంటి అధిక నీటి అవసరమున్న పంటల సాగును తగ్గించి, ఆరుతడి పంటలు మరియు ఆయిల్ పామ్ తోటల సాగు వైపు మళ్లాలని సూచించారు.ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా తాగునీటి నిర్వహణ, భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, నీటి వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజల్లో ఎల్‌నినో ప్రభావంపై విస్తృత అవగాహన కల్పిస్తూ, ముందస్తు చర్యలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు.అలాగే అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో శ్రీరంగాపురం సర్పంచ్ మద్దిలేటి, వ్యవసాయ అధికారులు, ఆయా మండలాల ఎంపీడీఓలు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు), గ్రామ సర్పంచ్‌లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!