– రోడ్డు విస్తరణ పేరుతో వ్యాపారులపై వేధింపులు ఆపాలి, చైర్మన్ భర్త షాపుల ఆక్రమణలు తొలగించాలి,
– నష్టపరిహారం ఇచ్చాకే దుకాణాల తొలగింపు చేపట్టాలి, అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్. సతీష్ యాదవ్ డిమాండ్,
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినప త్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్.03.2026.వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్డు వెడల్పు పనులకు తాము పూర్తి మద్దతు ఇస్తామని, అభివృద్ధి పేరుతో ప్రజల హక్కులను కాలరాస్తూ విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్. సతీష్ యాదవ్ అన్నారు.రోడ్డు విస్తరణ పనులను సోమవారం పరిశీలించిన ఐక్యవేదిక నాయకులు అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రోడ్డు వెడల్పు చేయాలనే నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అందుకు వ్యాపారులు కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు*. *అలాంటప్పుడు అధికార బలంతో వ్యాపారులను దూషించడం, వారి దుకాణాలను అస్తవ్యస్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు. రోడ్డు విస్తరణ పేరుతో పది ఫీట్ల లోతులో కాలువలు తవ్వడం వెనుక ఉద్దేశమేమిటని నిలదీశారు. వ్యాపారులతో సామరస్యంగా చర్చించి, వారిని ఒప్పించి తొలగింపు ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు.వనపర్తి పట్టణ ప్రథమ పౌరుడైన వ్యక్తి మొదట షాపు ముందల పది ఫీట్ల అరుగును తొలగించుకుని ముందల కాల్వ చేసుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు డా. సతీష్ యాదవ్, బీఎస్పీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు ,టిడిపి నాయకులు కొత్త గొల్ల శంకర్, బిజెపి నాయకులు రవి, రామస్వామి, శివకుమార్, తిరుపతి నాయక్ తదితరులు పాల్గొన్నారు.


