తుది దశలో ఉన్న రూ.80 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం
వచ్చే ఏడాది ఆగస్టు నాటికి అందుబాటులోకి కోర్టు సేవలు
నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 05 2026: వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.80 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులను గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని ఆర్ అండ్ బి శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 12 రకాల కోర్టులకు అవసరమైన నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. దీనివల్ల న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలకు ఒకే ప్రాంగణంలో మెరుగైన న్యాయసేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనుల్లో మొదటి, అంతస్తుల స్లాబ్ పనులు పూర్తయ్యాయని, మరో అంతస్తు స్లాబ్ పనులు చివరి దశకు చేరుకున్నాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో కొన్ని కారణాల వల్ల పనుల్లో స్వల్ప జాప్యం చోటుచేసుకుందని తెలిపారు. పనులను వేగవంతం చేసి, వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికి ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు కోర్టు సేవలు అందించనున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు వెల్లడించారు. వనపర్తి జిల్లా న్యాయవ్యవస్థకు ఆధునిక వసతులు కల్పించడంతో పాటు ప్రజలకు సౌకర్యవంతమైన న్యాయసేవలు అందించడంలో ఈ ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్ కీలక మైలురాయిగా నిలవనుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ se, ee శాఖ అధికారులు, వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి SLN రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


