ePaper
Tuesday, September 1, 2026
📄 ePaper
Homeతెలంగాణఖమ్మంవిముక్తి జాతుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి

విముక్తి జాతుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక స్వావలంబన కల్పించాలి

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దిన పత్రిక పి యన్ 9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావు ఖమ్మం, ఆగస్టు 31, 2026: విముక్తి జాతుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ, ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఖమ్మం IDOC కాంప్లెక్స్, 2వ అంతస్తు, రూమ్ నంబర్ ఎస్ -30లో సోమవారం ఉదయం 10.30 గంటలకు విముక్తి జాతుల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంచార జాతుల ఖమ్మం జిల్లా అధ్యక్షులు వల్లెపు సోమరాజు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా డా. కె.వి. కృష్ణారావు, డెరంగుల బ్రహ్మం, పొదిలి నరసింహారావు, పూసల షేక్ మస్తాన్, గారడీ సాయిబు పఠాన్ బడే ఖాన్, బత్తుల గోపాల్, ఒర్సు కృష్ణ, మల్లూరు కృష్ణయ్య, బాలేఘాట్ నరసింహారావు. పాల్గొన్నారు.వల్లెపు సోమరాజు: సంచార జాతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. సభాధ్యక్షులు వల్లెపు సోమరాజు మాట్లాడుతూ సంచార, విముక్త జాతుల కుటుంబాలు ఇప్పటికీ అనేక సామాజిక, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. సంచార జాతుల యువతకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయాలని, సంచార జాతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన కోరారు. డా. కె.వి. కృష్ణారావు: విద్య, ఉపాధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి డా. కె.వి. కృష్ణారావు మాట్లాడుతూ సంచార, విముక్త జాతుల అభివృద్ధికి విద్య, ఉపాధి మరియు ఆర్థిక అవకాశాలు కీలకమని అన్నారు. అర్హులైన పేదలకు రుణాలు అందించే సమయంలో సిబిల్ స్కోర్, గ్యారంటీ, ష్యూరిటీ వంటి అంశాలు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం ప్రత్యేక రుణ విధానం తీసుకురావాలని కోరారు. చిన్న వ్యాపారాలు, సంప్రదాయ వృత్తులు, స్వయం ఉపాధికి సబ్సిడీతో కూడిన రుణాలు అందించాలని అన్నారు.

డెరంగుల బ్రహ్మం: పాలనలో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి శ్రీ డెరంగుల బ్రహ్మం గారు మాట్లాడుతూ సంచార జాతులకు కేవలం సంక్షేమ పథకాలు అందించడం మాత్రమే కాకుండా పాలనలోనూ తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సంచార జాతులకు చెందిన అన్ని కులాలకు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని, ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలని కోరారు. సంచార జాతుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ముఖ్య డిమాండ్లు

సంచార, విముక్త జాతుల అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి. సంచార జాతులకు చెందిన అన్ని కులాలకు నామినేటెడ్ పదవుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలి. స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు, సంప్రదాయ వృత్తులకు ప్రత్యేక సబ్సిడీలు, రుణ సౌకర్యాలు కల్పించాలి. సిబిల్ , గ్యారంటీ, ష్యూరిటీ వంటి నిబంధనల కారణంగా పేదలు రుణాలకు దూరం కాకుండా ప్రత్యేక రుణ విధానం తీసుకురావాలి. ప్రతి సంచార జాతి కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించాలి. సంచార, విముక్త జాతుల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. సంచార, విముక్త జాతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సంక్షేమ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలి. “సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా—పాలనలో భాగస్వాములుగా, ఆర్థికంగా స్వావలంబులుగా, సమాజంలో ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని నాయకులు స్పష్టం చేశారు.

పాల్గొన్న సంచార జాతుల ప్రతినిధులు

ఈ కార్యక్రమంలో కుంచపు వెంకటేశ్వర్లు చల్లాయాలద్రి, వల్లెపు హరిష్, నాగేశ్వరరావు, రాము, ఉపేందర్, రాములు, పెనుగొండ వీరయ్య, వెంకన్న, వేముల వెంకటనారాయణ, సర్వేశ్, ఎడుకొండలు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు.దండగల రాంబాబు. తదితర సంచార జాతుల ప్రతినిధులు పాల్గొన్నారు. సంచార జాతుల ప్రతినిధులు, ఖమ్మం జిల్లా

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!