ePaper
Friday, September 25, 2026
📄 ePaper

వైరా ఎమ్మెల్యే కృషితో విద్యుత్ స్తంభాలఏర్పాటు, శాలువాతో సత్కరించిన గ్రామస్తులు 

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 25 2026: జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న పడమట నర్సాపురం గ్రామపంచాయతీ, పరిధిలో దండుమిట్ట తండా గ్రామ సమీపంలో మెయిన్ రోడ్ పక్కన దాదాపు 23 ఏళ్ల నుంచి సర్వీస్ వైర్లు కిందకి వచ్చి , ఆర్ అండ్ బి చెట్ల పైన నుంచి మొత్తం లీక్ కనెక్షన్ కలిగి ఉన్నాయి. అలాగే భూమికి సరిహద్దులో రెండు జానడు మందంలోనే మొత్తం కిందికి ఉన్నాయి. ఆ సరిహద్దులో ఉన్న ఐదు కుటుంబాల ఇండ్లు, ప్రభుత్వ స్కూలు,మరియు గుట్ట ప్రక్కన ఉన్న ఇమ్మానుయేలు చర్చ్,సర్వీస్ వైర్లతో విద్యుత్ మీటర్లు కలిగి ఉన్నారు.కానీ విద్యుత్ పోల్స్ లేక పోవడం వలన గాలి ,వానలకు, సర్వీస్ వైరు తెగిపోవడం, విద్యుత్ అంతరాయం కలిగించడం. అలాంటి దాదాపు 23 సంవత్సరాలుగా ఇబ్బందులతో గడిచింది. గ్రామంలో కొంతమంది గ్రామస్తులు మరియు చర్చి పాస్టర్ కలిసి వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి,మాట్లాడి వాళ్లకున్న విద్యుత్ స్తంభాల కొరతను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వివరించారు. తక్షణమే ఎమ్మెల్యే స్థానిక జూలూరుపాడు కరెంట్ ఏఈ రత్నకుమార్ కు ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది.తక్షణమే ఎంక్వయిరీ చేసి పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశానుసారంగా కరెంట్ ఏఈ రత్నకుమార్ తన సిబ్బందితో కలిసి, దండుమిట్ట తండా కు వెళ్లి నేరుగా,పరిశీలించి,ఎస్టిమేషన్ అంచనా చూసుకొని గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. వెంటనే రెండో రోజు విద్యుత్ స్తంభాలు పనులను ఏర్పాటు చేశారు.దాదాపు సపోర్టు స్తంభాలతో కలిపి 12 స్తంభాల వరకు వేయడం జరిగింది. మండలంలో గిరిజనేత్తులు,గిరిజన ప్రాంతం, కలిగి ఉన్నారు. దాంతో భాగంగా వ్యవసాయ ప్రాంతం, మరియు రోజువారి పనులకు వెళ్తూ జీవనాన్ని గడుపుతున్న గిరిజనులు కలిగి ఉన్నారు. అది గమనించిన కరెంటు ఏఈ తక్కువ సమయంలో దాదాపు ఉదయం ఏడు గంటలకు విధులకు వచ్చి, రాత్రి 9 గంటల వరకు పనులను చేయించడం జరిగింది. ముఖ్యంగా ఇచ్చిన మాటను నెరవేర్చినందుకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు గ్రామస్తులు కృతజ్ఞతలను తెలిపారు. అలాగే తక్కువ సమయంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసిన కరెంట్ ఏఈ రత్నకుమార్ నీ కూడా కృతజ్ఞతలను తెలియజేశారు.ఇచ్చిన మాటను నెరవేర్చుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ను కలిసి శాలువాతో సత్కరించి,స్వీట్లు తినిపించి కృతజ్ఞతలను తెలియజేశారు. అలాగే ఎమ్మెల్యే ఆదేశానుసారంగా పనులను పూర్తి చేసినందుకు జూలూరుపాడు కరెంటు ఏఈ రత్నకుమార్ కూడా ఎమ్మెల్యేకు చాలువతో సత్కరించి స్వీట్ తినిపించడం జరిగింది.

వైరా ఎమ్మెల్యే మాట్లాడుతూ: వైరా ప్రాంతం.అందరూ నిరుపేద కుటుంబాలు ఉన్నారు. ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి బాటలో అనునిత్యం నడుస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినందుకు కరెంటు ఏఈ నీ కూడా అభినందనలను తెలియజేశారు. అలాగే అభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లి పనులను కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సుఖ సంతోషాలతో అభివృద్ధి కలిగి ఉండాలని ఆకాంక్షించారు. ఇంకా ఏమైనా కావాలంటే నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని రైతుల కష్టాలు నాకు తెలుసు, వాళ్ల కోసమే అనునిత్యం అభివృద్ధి బాటలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు కరెంట్ ఏఈ రత్నకుమార్, చర్చి పాస్టర్ కబీర్ దాస్, వీరు నాయక్, కృష్ణ , గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Latest Articles

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, సభ్యులకు ఘన స్వాగతం రామావత్ రమేష్ నాయక్

పొలిటికల్ పవర్ జాతీయ దినపత్రిక ప్రతినిధి వనం శ్రీనివాస్ స్టేట్ క్రైమ్...

గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు బీఆర్‌సీ పాయింట్‌ పర్సన్‌లకు శిక్షణ

ఇన్‌పుట్స్‌ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంకలసపాడు సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ టీవీ...

 ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ.....

ఎస్ డబ్ల్యూ పిసి కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఎంపీడీవో మహబూబ్ భీ..

 సెప్టెంబర్ 25 పొలిటికల్ పవర్ . సమగ్ర జాతీయ తెలుగు...

ఏడాది పోరాటం ఫలించింది.. ఎగమాలపాడుకు రూ.2.63 కోట్ల రోడ్డు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9...

Related Articles

పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని ఢీకొన్న లారీ

ఎస్సై, డ్రైవర్‌ కు తీవ్ర గాయాలు – ఆసుపత్రిలో పరామర్శించిన ఖమ్మం పోలీస్ కమిషనర్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్...

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం..

తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్‌కు రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని పోలీస్ వాహనం ధ్వంసం.. ఎస్సై, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు.. *వినాయక నిమజ్జన విధులు ముగించుకుని పిండిప్రోలు నుంచి తిరుమలాయపాలెం పోలీస్‌స్టేషన్‌కు తిరిగి వస్తుండగా గురువారం అర్ధరాత్రి...

ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదు.. ఒక కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై నమ్మకం. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా గృహ నిర్మాణానికి పెద్దపీట వేసి, పేద‌ల‌...
error: Content is protected !!