ePaper
Monday, November 9, 2026
📄 ePaper

శ్రీశైలంలో వైభవంగా స్వామి అమ్మవార్ల పల్లకీ ఉత్సవం

📰 Generate e-Paper Clip

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నంద్యాల జిల్లా, శ్రీశైలం, నవంబర్ 09 2026: శ్రీశైలం లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల పల్లకీ ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూలా నక్షత్రం రోజుల్లో దేవస్థానం ఈ ఉత్సవాన్ని సర్కారీ సేవగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవంలో భాగంగా ముందుగా అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో అర్చక స్వాములు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సేవా సంకల్పాన్ని పఠించారు. అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో అధిష్ఠింపజేసి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు నిర్వహించారు. లోకకల్యాణం, సకల జనుల శ్రేయస్సును ఆకాంక్షిస్తూ నిర్వహించిన ఈ పల్లకీ ఉత్సవం ఆలయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది.

Latest Articles

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజపొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు  పొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ పొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ పొలిటికల్ పవర్...

అశ్వారావుపేట 4వ వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు భూమిపూజ పొలిటికల్ పవర్...

Related Articles

శ్రీశైలంలో బయలువీరభద్రస్వామివారికి విశేష పూజలు

అమావాస్య సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు.. భక్తులకు పరోక్ష సేవ అవకాశం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ నవంబర్ 09 2026: శ్రీశైలం అమావాస్య...

సొంతూరు ‘చంద్రగిరి’లోనే ప్రజాదరణ సున్నా.. పులివెందుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి** 15 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తిని...

జగ్గయ్యపేట ZPTCగా మండవ శ్రీనివాస్ ఘన విజయం! 1,108 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన మండవ

  పొలిటికల్ పవర్  ప్రతినిధి  జగ్గయ్యపేట :కృష్ణ  జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరిగిన జగ్గయ్యపేట మండల జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ZPTC) ఎన్నికల్లో మండవ శ్రీనివాస్ ఘన విజయం సాధించారు....
error: Content is protected !!