పొలిటికల్ పవర్, ఆగస్టు 27,అన్నపురెడ్డిపల్లి: మండలంలోని బుచ్చన్నగూడెం గ్రామంలో నిర్వహించిన సమ్మక్క–సారక్క జాతర మహోత్సవంలో బూర్గంపహాడ్–అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర తొలి ట్రైకార్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. తాటి భద్రయ్య–శ్రీనివాసమ్మ దంపతుల ఆహ్వానం మేరకు జాతరకు హాజరైన ఆయనకు గ్రామ ప్రజలు, నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం సమ్మక్క–సారక్క అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమ్మక్క–సారక్క అమ్మవార్లు ప్రజల ఇలవేల్పుగా, ధైర్యానికి ప్రతీకగా కొలువబడుతున్నారని అన్నారు. అమ్మవార్ల ఆశీస్సులతో అన్నపురెడ్డిపల్లి మండల ప్రజలు, బుచ్చన్నగూడెం గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వీరబోయిన వెంకటేశ్వర్లు, ఇనపనూరి రాంబాబు, చల్లా రమేష్, పెద్దారపు నాగరాజు, తాటి భద్రయ్యతో పాటు గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
