ePaper
Monday, August 3, 2026
📄 ePaper
Homeతెలంగాణవనపర్తిసోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది

సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యే మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 02 2026 తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం చిరస్మరణీయమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు ఎందరో విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఉద్యోగులు కర్షకులు కార్మికులు విద్యార్థులు ఎంతోమంది రోడ్లపైకి వచ్చి నిరసనను బలంగా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని, అనేక రాజకీయ ఒత్తిళ్లు మరియు సవాళ్లను ఎదుర్కొంటూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ చూపిన చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పది సంవత్సరాలు గత పాలకుల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు. గత రెండున్నర సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళుతుందని నిరుపేదలకు సంక్షేమ కొన్నాను అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, పట్టణ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!