ePaper
Sunday, September 13, 2026
📄 ePaper

స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధువంతం గా ఎదుర్కొంటాం

📰 Generate e-Paper Clip

  • స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటాం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*

కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికీ పార్టీ ఐడి కార్డులు అందజేస్తాం.

మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా, సీఈసీ సభ్యులు కే. సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి…..  ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన వెస్ట్ జోన్ సమావేశం నిర్వహించడం జరిగింది.  కడప నగరంలోని ఊట్కూరు సమీపం నందు ఉన్న సింధూర్ కళ్యాణమండపం నందు వెస్ట్ జోన్ అధ్యక్షులు నాగ మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెస్ట్ జోన్ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమే ప్రధాన అజెండాగా ఈ సన్నాహక సమావేశం జరిగింది.  ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా గారు, సీఈసీ సభ్యులు కే. సురేష్ బాబు గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, మాజీ మేయర్ పాకా సురేష్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, జమాల్ వలి గారు, కడప నియోజకవర్గ అబ్జర్వర్ గురుమోహన్ గారు, ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య గారు,రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ గారు, వెస్ట్ జోన్ అధ్యక్షులు నాగమల్లారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికార బలంతో ఎన్నికల్లో నెగ్గాలని చూస్తున్నప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం, కార్యకర్తల బలం ఉందని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన సగం కాలం పూర్తయిందని, టీడీపీ పాలనకు ఇంటర్వెల్ అయిపోయిందని నాయకులు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి పాలనపై చర్చ జరుగుతోందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరోసారి వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఒకే నోటిఫికేషన్ ద్వారా పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేసినా ఎలాంటి ఆరోపణలు రాలేదని, అయితే కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నిరాశకు గురిచేసిందని విమర్శించారు. రైతులు రెండేళ్లుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు, యువత ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. “అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది” అని భరోసా ఇచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి నాయకుడు, కార్యకర్త, పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.  కడప నగరంలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రస్తుతం కూటమి నాయకులు టెంకాయలు కొట్టి రిబ్బన్ కటింగ్‌లు చేస్తున్నారని విమర్శించారు.  కడప నగరంలోని 66 డివిజన్లలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాబలంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు.

అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పనిచేస్తే, అలాంటి అధికారులను చట్టం ముందు నిలబెడతామని మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ బాషా గారు హెచ్చరించారు.

అధికారం శాశ్వతం కాదు.. అధికారులు శాశ్వతం అనే విషయాన్ని ప్రతి అధికారి గుర్తుపెట్టుకోవాలని అన్నారు. నేడు అధికారంలో ఉన్నవారికి లొంగి తీసుకున్న నిర్ణయాలకు భవిష్యత్తులో చట్టపరంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

2014లో పార్టీ ఓటమి చెందినప్పటికీ కార్యకర్తలు అధైర్యపడకుండా కలిసికట్టుగా పనిచేసి 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేశారని గుర్తుచేశారు. వైఎస్ జగన్ నాయకత్వంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించామని, ప్రజా సేవే పరమావధిగా పనిచేశామని తెలిపారు.

గత ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తులో మరింత పటిష్టంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

“వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తే అధినేత” అనే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రతి డివిజన్లో పార్టీని బలోపేతం చేయాలని తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలను ప్రజల ముందు నిలదీయాలని, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా ప్రతినిధుల అవినీతి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మధ్య ఉన్న అభివృద్ధి, సంక్షేమం, ప్రజా పాలనలోని వ్యత్యాసాన్ని ప్రతి ఇంటికీ వివరించి, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కోఆప్షన్ సభ్యులు, డివిజన్ ఇన్చార్జీలు, నియోజకవర్గ స్థాయి నాయకులు, పాల్గొన్నారు.

Latest Articles

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా...

అక్టోబర్ 7న దళిత జర్నలిస్టుల పోరం రాష్ట్ర మహాసభను విజయవంతం చెయ్యాలి

– దళిత జర్నలిస్టుల పోరం వ్యవస్థాపకులు కాశపోగు జాన్,– కొత్తకోట ఎస్సైలు...

పామాయిల్ గెలల దొంగతనాలకు చెక్‌.. పోలీసుల కఠిన చర్యలు

ఫ్యాక్టరీల యాజమాన్యాలు,కలెక్షన్ ఏజెంట్లతో పోలీసుల సమావేశం.. రైతులకు కీలక సూచనలు పొలిటికల్ పవర్,దమ్మపేట...

Related Articles

బిక్కవోలు పోలీసుల దాడులు.. అక్రమ బాణసంచా తయారీ గుట్టురట్టు

  బిక్కవోలు: బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కొమరిపాలెం గ్రామ శివారులోని చేపల చెరువుల వద్ద అక్రమ బాణసంచా తయారీ జరుగుతున్నట్లు...

రాజీ మార్గం ద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వర న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యం

–3వ జాతీయ లోక్ అదాలత్‌లో 6,617 కేసుల పరిష్కారం,జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు,పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.13.2026.రాజీమార్గంద్వారాకేసులకుసత్వరపరిష్కారంసత్వరన్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యంమని,3వ జాతీయ...
error: Content is protected !!