లక్షెట్టిపేట 7వ అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు – గర్భిణీకి వైభవంగా శ్రీమంతం
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
- ఆగస్టు 7: మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట పట్టణంలోని 7వ అంగన్‌వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక గర్భిణీ స్త్రీకి అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా శ్రీమంతం నిర్వహించి,పండ్లు మరియు పోషకాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కౌన్సిలర్లు శనివారపు చిన్నయ్య ఆరీఫ్, చంద్రమౌళి, మరియు గారలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ.నవజాత శిశువులకు తల్లిపాలు అమృతంతో సమానమని, బిడ్డ పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు (ముర్రుపాలు) పట్టించడం ఎంతో అవసరం అని పేర్కొన్నారు. తల్లిపాలు తాగడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఎదుగుతారని, అలాగే తల్లుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరూ తల్లిపాల ప్రాముఖ్యతను గుర్తించి, పిల్లల సమగ్ర వికాసానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత, కౌన్సిలర్లు శనివారపు చిన్నయ్య ఆరీఫ్, చంద్రమౌళి, మరియు గారలు, అంగన్వాడీ టీచర్స్ రాధిక, శంకరమ్మ, నీరజ, శంకరమ్మ ఆయా, గర్భిణులు, బాలింతలు మరియు స్థానిక మహిళలు, చిన్న పిల్లలు పాల్గొన్నారు.



