📰 Generate e-Paper Clip
ఎల్లారం ప్రాథమిక పాఠశాల లో స్పోర్ట్స్ దుస్తుల డొనేట్ చేసిన
ఎల్లారం సర్పంచ్ గొడిశల రాజేశం

ఆగస్టు 14: పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం ఎల్లారం గ్రామపంచాయతీ లోని ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచ్ గొడిశల రాజేశం స్కూల్ లో చదువుతున్న పిల్లల అందరికి సొంత ఖర్చులతో స్పోర్ట్స్ డ్రెస్ డొనేట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లక్షెట్టిపెట్ ఎంఈఓ శైలజ పాల్గొన్నారు. ఎంఈఓ మాట్లాడుతూ ఎల్లారం స్కూల్ పిల్లలందరికీ సర్పంచ్ గారు ప్రత్యేక శ్రద్ధ తో స్పోర్ట్స్ డ్రెస్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అదే విధంగా ప్రభుత్వం కూడా పిల్లలకి షూస్ ఇస్తున్నారు.ఇంకా రానున్న రోజుల్లో స్కూల్ యూనిఫామ్ టై బెల్ట్ కూడా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. గ్రామంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా మీ మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించగలరు అని సూచించారు.ఎల్లారం పాలక వర్గం విద్య కి అధిక ప్రాధాన్యత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం చాలా గర్వించదగ్గ విషయం.అని కొనియాడారు.పిల్లలందరికీ స్పోర్ట్స్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అని ఎంఈఓ ,సర్పంచ్ గారి ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం ఉమ,సెక్రెటరీ వరుణ్,టీచర్లు, వార్డు సభ్యులు,తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.