📰 Generate e-Paper Clip
విరాళంగా 100 స్టీల్ ప్లేట్లు అందజేత

సెప్టెంబర్ 15: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా దండేపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎం.పీ.టీ.సీ సభ్యులు గడిపెల్లి సత్యం,గడిపెల్లి లచ్చన్న వారి తల్లి దండ్రులైన రాజవ్వ, ఇందయ్య జ్ఞాపకార్థం దండే పెల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు 5000 /- రూపాయల విలువ గల మధ్యాహ్న భోజనం కు సంబంధించిన 100 ప్లేట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంగర్స్ రాజేశ్వరరావు గారికి అందజేయడమైనది.ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు అప్పాల మనోహర్, ఎన్ .శ్రీనివాస్ పాత రమేష్ ఎన్.రవీందర్ జి.రామ్ మోహన్ రావు సిఎచ్ రమేష్ సిఎచ్ శ్రీనివాస్, ఎస్ రవి పాల్గొన్నారు.