ఆదిలాబాద్ రిమ్స్ లో ప్రమాదం ప్రభుత్వ వైఫల్యమే…!!!

దర్యాప్తు వేగవంతం చేసి బాధిత కుటుంబాలను ఆదుకోవాలి.
గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి…
*-జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డా. చుంచు రాజ్ కిరణ్.
ఈరోజు ఆదిలాబాద్ రిమ్స్* *ఆసుపత్రి ని సందర్శించి ప్రమాదానికి సంభందించిన ఘటన పై రిమ్స్ డైరెక్టర్*
సెప్టెంబర్ 23: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
డా. జైసింగ్ రాథోడ్ తో,
డి ఎం అండ్ హెచ్వో డా. సాధన మరియు ప్రోగ్రాం డైరెక్టర్ డా. తిప్పస్వామి గార్లతో చర్చించడం జరిగింది.నవజాత శిశువులు చికిత్స పొందుతున్న ప్రత్యేక సంరక్షణ విభాగంలో మంటలు చెలరేగి ముగ్గురు పసికందులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు పడుతున్న వేదనను మాటల్లో చెప్పలేం. ఆ చిన్నారులు తమ జీవితాన్ని ప్రారంభించకముందే ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. చికిత్స పొందుతున్న మిగిలిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఇది కేవలం ఒక ప్రమాదంగా ముగిసిపోకూడదు. *ఆసుపత్రుల్లో ముఖ్యంగా ఐసీయూ లు, ఎన్ ఐ సి యు, ఎస్ ఎన్ సి యు వంటి అత్యంత సున్నితమైన విభాగాల్లో విద్యుత్ వ్యవస్థలు, ఏసి, ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, అలారం వ్యవస్థలు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలి. ఈ ఘటనకు అసలు కారణం ఏమిటి? నిర్వహణలో ఏమైనా లోపాలు ఉన్నాయా? భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలయ్యాయా? అనే అంశాలపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలి. తప్పిదం ఎక్కడ జరిగిందో స్పష్టంగా గుర్తించి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించాలి. చికిత్స పొందుతున్న చిన్నారులకు అత్యుత్తమ వైద్యం అందించాలి. ఒక ప్రాణాన్ని కూడా కాపాడాల్సిన ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక ఫైర్ సేఫ్టీ మరియు ఎలక్ట్రికల్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి. ప్రజల ప్రాణాలు, ముఖ్యంగా పసికందుల ప్రాణాలు రాజకీయాలకు అతీతం. భవిష్యత్తులో ఇలాంటి విషాదం మరొక కుటుంబానికి రాకుండా ప్రభుత్వం కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలి. మృతిచెందిన చిన్నారుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అయన వెంట జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ ఉపాధ్యక్షులు ఉడుగు రవితేజ నాయకులు వినయ్, రవీందర్, శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు.*

