దండేపల్లి పోలీస్ స్టేషన్ లో ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు – దాడిలో ముగ్గురికి గాయాలు

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా, దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లపేట గ్రామంలో తేదీ 20.10.2026 న సాయంత్రం సుమారు 5:40 గంటల సమయంలో జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఆరుగురు వ్యక్తులపై దండేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది.
ఫిర్యాదుదారురాలు పేరం రజిత (40), భర్త రాజన్న, తాళ్లపేట గ్రామం, తన సోదరుడు ఆకుల రాజేంద్ర ప్రసాద్ మరియు మేనల్లుడు ఆకుల అకిరానందన్తో కలిసి జమ్మికి వెళ్తున్న సమయంలో, వారి పొరుగువారైన నిందితులు ఆకుల కిరణ్, ఆకుల రాజేందర్, ఆకుల సురేష్, ఆకుల విజయ్ వర్ధన్, ముట్టె కుమారస్వామి మరియు ఎర్రం మల్లేష్లు వారి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ కర్రలతో మరియు చేతులతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ దాడిలో ఆకుల రాజేంద్ర ప్రసాద్, ఆకుల అకిరానందన్ల తలలకు గాయాలు కాగా, ఫిర్యాదుదారురాలు పేరం రజిత చేతికి గాయమైనట్లు తెలిపారు. అంతేకాకుండా, నిందితులు వారిని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై దండేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, ఆకుల కిరణ్, ఆకుల సురేష్ మరియు ఆకుల విజయ్ వర్ధన్లను ఈ రోజు అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

