ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు

పొలిటికల్ పవర్ పిఎన్9టివి తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్. ప్రతి ఏటా మే 3 వ తేదీన అంతర్జాతీయ పత్రిక స్వేచ్చ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. 1991 లో యునెస్కో సర్వసభ్య సమావేశం చేసిన తీర్మానం మేరకు ఈ దినోత్సవాన్ని మే3న ప్రతి ఏటా నిర్వహించాలని ఐ.రా. స. జనరల్ అసెంబ్లీ 1993 లో తీర్మానం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా మే 3 న పత్రికా స్వేచ్ఛ దినోత్సవం గా నిర్వ హించాలని పిలుపు ఇచ్చింది. పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటనా స్వేచ్ఛ కు నేడు ఎదురవుతున్న సవాళ్లు, ప్రమాదాల గురించి పౌర సమాజానికి, ప్రభుత్వాలకు గుర్తు చేయడం, స్వేచ్చా పరిరక్షణకు పోరాడటం, మీడియా సంస్థల పై, సిబ్బంది పై పెరిగి పోతున్న నిర్బంధాలు, దాడులు, హత్యలు, గురించి సమాజం దృష్టిలో పెట్టడం, జర్నలిస్టుల భద్రత పై ప్రత్యేక చట్టం కోసం ఒత్తిడి తేవడం, వృత్తిలో ఆదర్శ ప్రాయ మైన కృషి చేసిన మహనీయులను గౌరవించుకోవడం,విధి నిర్వహణ లో అసువులు బాసిన పాత్రీకేయులను స్మరించుకోవడం వంటివి ఈనాటి దినోత్సవం లోని ముఖ్య అంశాలు. వివిధ దేశాలలో పత్రికా స్వేచ్ఛ స్థితి గతుల గురించి ఒక ఇండెక్స్ ను కూడా విడుదల చేస్తారు. మే3 కోసం ప్రతి ఏటా యునెస్కో ఒక థీమ్ ను ప్రకటిస్తుంది. 2019 కోసం ప్రజాస్వామ్యం ఎన్నికలు, నేటి తప్పుడు సమాచార యుగం లో జర్నలిజం – సవాళ్లు” థీమ్ ను యునెస్కో ప్రకటించింది. ఈ దినోత్సవానికి సంబంధించిన అంతర్జాతీయ స్థాయి కార్య క్రమం మే1 నుండి 3వరకూ ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా లో జరుగుతోంది. జర్నలిజం లో విశేష కృషి చేసిన వ్యక్తికి గాని, సంస్థకు గానీ అవార్డ్ ను యునెస్కో అంద చేస్తుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ను స్థాపించిన నవంబర్ 16 ను జాతీయ పత్రికా దినోత్సవంగా మన దేశం లో ప్రెస్ కౌన్సిల్ పిలుపు మేరకు నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో పాదమైన పాత్రికేయం స్వేచ్ఛ గా సమాజ శ్రేయస్సు పరిరక్షణలో గౌరవంగా ముందుకు సాగాలని కోరుకుంటూ. పాత్రికేయ మిత్రులు అందరికీ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు.

Latest Articles

అధికారంలో ఉండి కాంగ్రెస్‌ ధర్నాలు విడ్డూరం

  రాజకీయంగా ఎదుర్కోలేకే నిరసనలకు దిగుతున్నారు బీఆర్‌ఎస్‌ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డిపొలిటికల్ పవర్...

గణపయ్య రాకకు.. ఘనంగా ఏర్పాట్లు!

  గ్రామగ్రామాన మండపాల ముస్తాబు.. భక్తుల మాలధారణతో ఆధ్యాత్మిక సందడి పొలిటికల్...

పలు శుభకార్యాలకు హాజరైన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక...

రాజకీయాలలో అరుదైన నాయకులలో మన నాయకుడు ఒకరుఅలాంటి...

కోట్ల ఆస్తులు ఉన్నా... పక్కన మనిషి లేకపోతే ఆ జీవితం ఎంత...

Related Articles

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్...

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులుపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి...

టేకుమట్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గర్జన11/09/2026 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భూపాలపల్లి నియోజవర్గం...
error: Content is protected !!