లక్షట్ పేటలో ఇంటింటి సర్వే ముమ్మరం

సూపర్వైజర్ రజిత.
ఎన్వెంటర్ స్వప్న.
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మే 15 : 2026:మంచిర్యాల జిల్లా లక్షట్ పేట్ మండలం లో ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్యుమరేటర్లు
(సర్వే అధికారి) సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో శుక్రవారం రోజు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ వివరాలను నమోదు చేస్తున్న ఇన్వెంటర్ స్వప్న. ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరే విధంగా ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రతి కుటుంబ సభ్యుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు సూచనలు ఇచ్చారు. సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. గ్రామ ప్రజలు కూడా సర్వే సిబ్బందికి సహకరిస్తూ అవసరమైన సమాచారాన్ని అందిస్తున్నారు.ఇంటి నంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, ఉపాధి మరియు ఇతర అంశాలపై సమాచారం సేకరిస్తున్నారు.సర్వే పూర్తయిన తరువాత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఈ సమాచారం ఉపయోగపడనుంది.
లక్షెట్టిపేట లో కొనసాగుతున్న ఈ ఇంటింటి సర్వే కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది అన్నారు.
