ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఇదేందయ్య రాములా…మరీ ఇంత దారుణమా…న్యాయం కోసం వెళ్లిన వివాహితను గర్భవతిని చేసిన ఖమ్మం సీఐ

పొలిటికల్ పవర్ తెలుగు దిన పత్రిక పి యన్ నైన్ టీవీ

భర్తపై ఫిర్యాదుకు వచ్చిన మహిళను లోబర్చుకున్న సీఐ రాజు నాయక్

పెళ్లి పేరుతో గర్భవతిని చేసి, బలవంతంగా అబార్షన్ చేయించిన వైనం

బాధితురాలి ఫిర్యాదుతో సీఐపై కేసు నమోదు, ముందస్తు బెయిల్

విచారణలో ఆరోపణలు నిజమేనని తేలడంతో డీజీపీ ఆఫీస్‌కు అటాచ్

2023లో ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో రాజు నాయక్ సీఐగా ఉండగా ఓ మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు నుంచి ఫోన్ నంబర్ తీసుకున్న సీఐ, న్యాయం చేస్తానని నమ్మించి తరచూ ఫోన్లు, మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమెను లోబర్చుకున్నాడు.

 

ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే, సీఐ ఆమెకు బలవంతంగా కొన్ని ట్యాబ్లెట్లు మింగించడంతో గర్భస్రావం అయిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత కూడా పెళ్లి విషయాన్ని దాటవేస్తుండటంతో విసిగిపోయిన ఆమె ఈ నెల 7న ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

కేసు నమోదు కావడంతో సీఐ రాజు నాయక్ పరారీలోకి వెళ్లి, ఇటీవల ముందస్తు బెయిల్ పొందినట్లు సమాచారం. మరోవైపు, ఈ ఘటనపై జరిగిన అంతర్గత విచారణలో సీఐ వేధింపులకు పాల్పడినట్లు తేలడంతో ఉన్నతాధికారులు అతడిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాధితురాలికి ఇటీవలే ఆమె భర్త నుంచి కోర్టు ద్వారా విడాకులు మంజూరయ్యాయి. ఆమెకు విడాకులు ఇప్పించేందుకు సీఐ రాజు నాయక్ ఆమె భర్తపై ఒత్తిడి తెచ్చినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం తండా నందు సోషల్ మీడియా కన్వినర్  అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బి. ఎస్ మక్బూల్ ఈ కార్యక్రమంలో...

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కృషితో చెన్నాపురం చెరువులో గణేష్ నిమర్జనం ప్రారంభం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.           మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్...

ఆదివాసీ బెబ్బులి సోయం గంగులు త్యాగాన్ని స్మరించుకుందాం: సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. షాబీర్ పాషా

జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు దమ్మపేట / పొలిటికల్ పవర్, సెప్టెంబర్16:దగాపడ్డ నేల విముక్తి కోసం, వెట్టిచాకిరీ సంకెళ్లు తెంచేందుకు ‘భూమి కోసం.. భుక్తి కోసం’ ఉవ్వెత్తున...
error: Content is protected !!