ePaper
Friday, September 18, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా ట్రాఫిక్ ఏర్పాట్లపై మంచిర్యాల డీసీపీ క్షేత్రస్థాయి సందర్శన

మే 19 :

పొలిటికల్ పవర్ పిఎన్ 9 టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి నది అంత్య పుష్కరాల నేపథ్యంలో భక్తుల రాకపోకలకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోజు మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు మరియు ఇతర పోలీస్ అధికారులతో కలిసి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన రహదారులు, వంతెనలను సందర్శించి పరిశీలించారు.ఈ పుష్కరాలు మే 21వ తేదీ ఉదయం నుండి 12 రోజుల పాటు కాళేశ్వరం సరస్వతి నది తీరంలో జరగనున్నాయి.ఈ సందర్భంగా రామగుండం,పెద్దపల్లి,ఆదిలాబాద్,నిర్మల్,ఆసిఫాబాద్,మంచిర్యాల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి జైపూర్, భీమారం,చెన్నూర్ మార్గాల మీదుగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు.భక్తుల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,భద్రతా చర్యలు మరియు అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై అధికారులతో చర్చించారు. పుష్కరాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ నిర్వహణను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు డీసీపీ ఆదేశాలు జారీ చేశారు.డీసీపీ వెంట జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, కోటపల్లి ఎస్సై రాజశేఖర్,భీమారం ఎస్సై రాజేందర్ పాల్గొన్నారు.       

Latest Articles

గిరిజన భూములపై రాజకీయ తోడేళ్ల కళ్ళు

✓ పేదరికంలో మగ్గుతున్న ఎస్టీల భూములకు రక్షణ కల్పించాలి.✓ పత్రాలు,...

సోషల్ మీడియా కన్వీనర్ అశోక్ ని పరామర్శించిన కదిరి నియోజకవర్గ ఎస్.కె మక్బూల్

  ఈరోజు గాండ్లపెంట మండలం వేపరాల పంచాయతీ సి. యం...

*కుర్లి శివా రెడ్డి గారి స్వగృహం నందు తేనేటి విందులో పాల్గొన్న...

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5...

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లిగ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47...

Related Articles

జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు

 పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్లసెప్టెంబర్ 17న చెవెళ్ల  సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5 లక్షల లంచంలో భాగంగా రూ.1 లక్ష తీసుకుంటుండగా ఇద్దరు ట్రెజరీ అధికారులు, ఒక ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ కి పట్టుబడ్డారు.*_ _*ఒక...

భగవాన్ శ్రీ విశ్వకర్మ పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ

ఖమ్మం, సెప్టెంబర్ 17: పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల బ్యూరో బత్తుల గోపాలరావుతెలంగాణ బీసీ సంక్షేమ శాఖ...

24 గంటల్లో హత్య కేసును చేదించిన జమ్మికుంట పోలీసులు చాకచౌఖ్యంగా వ్యవహరించి కేసును చేదించిన పట్టణ సీఐ రామకృష్ణ

పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి జమ్మికుంట ఎల్లస్వామిజమ్మికుంట పోలీస్ స్టేషన్ లో సీఐ జమ్మికుంట పరిధిలోని తనుగుల గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో బొజ్జపల్లి రాజబాబు అనే వ్యక్తి హత్యకు గురైన సంఘటనకు...
error: Content is protected !!